Telugu Global
Cinema & Entertainment

సాహో వసూళ్లపై భారీ అంచనాలు

మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది సాహో సినిమా. ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. మొన్నటివరకు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ డిస్కషన్, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా జోరుగా ఊపందుకుంది. అందరూ చెబుతున్న సమాచారం ప్రకారం, తొలి రోజు సాహో సినిమాకు ఇండియా అంతటా 70 కోట్ల రూపాయల నెట్ వచ్చే ఛాన్స్ ఉందట. గ్రాస్ పరంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు […]

సాహో వసూళ్లపై భారీ అంచనాలు
X

మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది సాహో సినిమా. ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. మొన్నటివరకు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ డిస్కషన్, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా జోరుగా ఊపందుకుంది. అందరూ చెబుతున్న సమాచారం ప్రకారం, తొలి రోజు సాహో సినిమాకు ఇండియా అంతటా 70 కోట్ల రూపాయల నెట్ వచ్చే ఛాన్స్ ఉందట.

గ్రాస్ పరంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి రోజు వంద కోట్ల రూపాయల గ్రాస్ రావొచ్చనేది ఓ అంచనా. దీనికి రెండు బలమైన కారణాలు చెబుతోంది ట్రేడ్. వీటిలో ఒకటి భారీగా పెరిగిన టిక్కెట్ రేట్లు కాగా, రెండోది 6వేలకు పైగా లభించిన స్క్రీన్స్. సో.. ఈ రెండు కారణాల వల్ల సాహో సినిమాకు మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ గ్యారెంటీ అంటున్నారు.

ఇక ఇండియా విషయానికొస్తే.. బాహుబలి-2 సినిమాకు భారత్ లో అన్ని భాషల్లో కలుపుకొని మొదటి రోజు 112 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. సాహో ఈ రికార్డును అధిగమిస్తుందా అనేది డౌట్. అటు ఒక్క హిందీ వెర్షన్ కే బాహుబలి-2కు 41 కోట్ల రూపాయలు వచ్చాయి. సాహో హిందీ వెర్షన్ కు ఇంత వస్తుందా అనేది మరో డౌట్. ఇలాంటి ఎన్నో డౌట్స్ మధ్య సాహో సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వస్తోంది.

అయితే ట్రేడ్ అంచనా ప్రకారం, ఈ సినిమాకు భారత్ లో 70 కోట్ల రూపాయలు… హిందీ వెర్షన్ కు 21 కోట్ల రూపాయలు, తెలుగులో 40 కోట్ల రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ వసూళ్లలో ఇది బాహుబలి-2ను అధిగమించడం కష్టం అంటోంది ట్రేడ్.

First Published:  29 Aug 2019 11:00 AM GMT
Next Story