Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ డీపీ

ఈ మధ్య కాలంలో అభిమానులందరూ తమ ఫేవరేట్ హీరో ఫోటోలను సోషల్ మీడియాలో డిపి గా పెట్టుకొని ఆ హీరోల పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల పుట్టినరోజుల సందర్భంగా ఇలాంటి కామన్ డిపి లు ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్నాయి. త్వరలో సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 48 వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ పుట్టినరోజు కి ఒక కామన్ […]

రామ్ చరణ్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ డీపీ
X

ఈ మధ్య కాలంలో అభిమానులందరూ తమ ఫేవరేట్ హీరో ఫోటోలను సోషల్ మీడియాలో డిపి గా పెట్టుకొని ఆ హీరోల పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ముఖ్యంగా సెలబ్రిటీల పుట్టినరోజుల సందర్భంగా ఇలాంటి కామన్ డిపి లు ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్నాయి. త్వరలో సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 48 వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.

ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ పుట్టినరోజు కి ఒక కామన్ డిపి నీ తయారుచేసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఏపీ ఫ్లడ్ బాధితులకు సహాయాన్ని అందిద్దాం అంటూ రామ్ చరణ్ ఈ కామన్ డిపీని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికే కొందరు మెగా అభిమానులు ఈ ఫోటోని డిపి గా పెట్టేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పూర్తయ్యేదాకా ఈ డిపి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరోవైపు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పనులలో బిజీగా ఉన్నారు.

First Published:  28 Aug 2019 7:02 PM GMT
Next Story