Telugu Global
Cinema & Entertainment

సాహో ఫస్ట్ టాక్ వచ్చేది అక్కడ్నుంచే

పెద్ద సినిమా ఏది రిలీజైనా ఉమైర్ సంధు అనే వ్యక్తి ఫస్ట్ రివ్యూ అంటూ ట్వీట్ చేస్తుంటాడు. కానీ ఇతడి ట్వీట్స్ ను ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నప్పటికీ ఇతడు సూపర్ హిట్ అని రాస్తాడు. హీరోను ఆకాశానికెత్తేస్తాడు. ఏ సినిమాకైనా పబ్లిక్ టాక్ అనేది చాలా ముఖ్యం. సాహో సినిమాకు అలాంటి పబ్లిక్ టాక్ ముందుగా దుబాయ్ నుంచి రాబోతోంది. అవును.. ప్రపంచం మొత్తమ్మీద దుబాయ్ లోనే ముందుగా సాహో షో పడబోతోంది. […]

సాహో ఫస్ట్ టాక్ వచ్చేది అక్కడ్నుంచే
X

పెద్ద సినిమా ఏది రిలీజైనా ఉమైర్ సంధు అనే వ్యక్తి ఫస్ట్ రివ్యూ అంటూ ట్వీట్ చేస్తుంటాడు. కానీ ఇతడి ట్వీట్స్ ను ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నప్పటికీ ఇతడు సూపర్ హిట్ అని రాస్తాడు. హీరోను ఆకాశానికెత్తేస్తాడు. ఏ సినిమాకైనా పబ్లిక్ టాక్ అనేది చాలా ముఖ్యం. సాహో సినిమాకు అలాంటి పబ్లిక్ టాక్ ముందుగా దుబాయ్ నుంచి రాబోతోంది. అవును.. ప్రపంచం మొత్తమ్మీద దుబాయ్ లోనే ముందుగా సాహో షో పడబోతోంది.

దుబాయ్ కాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు సాహో షో పడుతుంది. దుబాయ్ లోని 4 ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో ఈ సినిమాను ముందుగా ప్రదర్శించనున్నారు. అంతేకాదు, ఈ ప్రదర్శనకు హీరో ప్రభాస్ కూడా హాజరవుతున్నాడు. అతడు ఈరోజు రాత్రికే దుబాయ్ వెళ్తున్నాడు. సో.. సాహో సినిమా ఎలా ఉందనేది ముందుగా దుబాయ్ నుంచి తెలుస్తుందన్నమాట.

ఇప్పటికే దుబాయ్ లోని స్క్రీన్స్ అన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఫుల్ అయిపోయాయి. వీళ్లంతా రేపు రాత్రికి సినిమా చూసి, భారతీయ కాలమానం ప్రకారం.. అర్థరాత్రి 12 గంటలకు ట్వీట్స్ పెట్టేస్తారు.

అయితే వీళ్ల రివ్యూ సాహో సినిమాపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే.. అప్పటికి మరికొన్ని గంటల్లో ఇండియాలో షోలు ప్రారంభం అయిపోతాయి. ఆ గ్యాప్ లోనే ఓవర్సీస్ లో కూడా షోలు మొదలైపోతాయి.

First Published:  28 Aug 2019 11:15 AM GMT
Next Story