Telugu Global
Cinema & Entertainment

మాస్ రాజా సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రవితేజ, తన ఆశలన్నీ డిస్కోరాజా పైనే పెట్టుకున్నాడు. ఇంతకుముందు తన సినిమాల విడుదల తేదీలపై పెద్దగా ఆలోచించేవాడు కాదు రవితేజ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ ఆలోచించుకోవాల్సి వస్తోంది. అందుకే డిస్కో రాజాకు క్రిస్మస్ సీజన్ ను సెలక్ట్ చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే డిసెంబర్ 20న డిస్కోరాజాను థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. క్రిస్మస్ సీజన్ అటుఇటుగా 20వ తేదీ నుంచే మొదలవుతుంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో తెలుగు ప్రేక్షకులు […]

మాస్ రాజా సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రవితేజ, తన ఆశలన్నీ డిస్కోరాజా పైనే పెట్టుకున్నాడు. ఇంతకుముందు తన సినిమాల విడుదల తేదీలపై పెద్దగా ఆలోచించేవాడు కాదు రవితేజ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ ఆలోచించుకోవాల్సి వస్తోంది. అందుకే డిస్కో రాజాకు క్రిస్మస్ సీజన్ ను సెలక్ట్ చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే డిసెంబర్ 20న డిస్కోరాజాను థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.

క్రిస్మస్ సీజన్ అటుఇటుగా 20వ తేదీ నుంచే మొదలవుతుంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో తెలుగు ప్రేక్షకులు ఖాళీగా ఉంటారు. అలాంటి టైమ్ లో డిస్కోరాజాను తీసుకొస్తే బెటరని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మేరకు థియేటర్ యాజమాన్యాలతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా ఫస్ట్ కాపీ నవంబర్ నాటికే రెడీ అయిపోతుంది. కానీ కేవలం క్రిస్మస్ ను దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ లో వస్తున్నారు.

నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు. రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సైన్స్-ఫిక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది డిస్కో రాజా.

First Published:  28 Aug 2019 11:24 AM GMT
Next Story