Telugu Global
Cinema & Entertainment

ఈ సినిమా కూడా రీమేక్.. కానీ చెప్పరంతే!

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘ఎంత మంచి వాడవురా’ అనే సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఇదొక అందమైన ప్రేమకథ. గోదావరి పల్లెల్లో నడిచే కథ. అచ్చ తెలుగు సినిమా. మొన్నటివరకు ఈ సినిమాకు ఇచ్చిన కలరింగ్ ఇది. కట్ చేస్తే, ఇది కూడా రీమేక్ అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవును.. ఓ గుజరాతీ సినిమాకు రీమేక్ గా ‘ఎంత మంచి వాడవురా’ కథను తెరకెక్కిస్తున్నారట. సినిమా లాంఛింగ్ రోజు ఈ విషయాన్ని మేకర్స్ బయటపెట్టలేదు. […]

ఈ సినిమా కూడా రీమేక్.. కానీ చెప్పరంతే!
X

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘ఎంత మంచి వాడవురా’ అనే సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఇదొక అందమైన ప్రేమకథ. గోదావరి పల్లెల్లో నడిచే కథ. అచ్చ తెలుగు సినిమా. మొన్నటివరకు ఈ సినిమాకు ఇచ్చిన కలరింగ్ ఇది.

కట్ చేస్తే, ఇది కూడా రీమేక్ అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవును.. ఓ గుజరాతీ సినిమాకు రీమేక్ గా ‘ఎంత మంచి వాడవురా’ కథను తెరకెక్కిస్తున్నారట.

సినిమా లాంఛింగ్ రోజు ఈ విషయాన్ని మేకర్స్ బయటపెట్టలేదు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా రీసెంట్ గా విడుదల చేసిన ప్రెస్ మీట్ లో కూడా రీమేక్ అనే విషయాన్ని బయటపెట్టలేదు. తాజాగా యూనిట్ కు చెందిన కొందరు సభ్యులు ఈ విషయాన్ని లీక్ చేశారు.

మన్మథుడు-2, ఎవరు సినిమాలు కూడా రీమేక్స్. కానీ ఆ విషయాన్ని రిలీజ్ వరకు మేకర్స్ బయటపెట్టలేదు. సినిమాపై హైప్ తగ్గుతుందనే భయంతో ఇలా చేసి ఉంటారు. ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమాకు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఇంతకీ వీళ్లు రీమేక్ రైట్స్ తీసుకున్నారో లేదో.

First Published:  27 Aug 2019 11:39 PM GMT
Next Story