Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సినిమా హీరోయిన్ ఫిక్స్?

సినిమాకు కొబ్బరికాయ కొట్టకముందు నుంచే హీరోయిన్ కోసం వెదికారు. స్టార్ హీరోయిన్స్ కోసం ట్రై చేశారు. కొత్త ముఖాల్ని కూడా పరిశీలించారు. ఎట్టకేలకు అఖిల్ సినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పూజా హెగ్డే, అఖిల్ సరసన హీరోయిన్ గా మెరవనుంది. ఈ మేరకు పూజా హెగ్డేకు ఫుల్ నెరేషన్ ఇచ్చాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. అటు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాత అల్లు అరవింద్ కూడా ముందుకొచ్చాడట. దీంతో పూజాహెగ్డే, […]

అఖిల్ సినిమా హీరోయిన్ ఫిక్స్?
X

సినిమాకు కొబ్బరికాయ కొట్టకముందు నుంచే హీరోయిన్ కోసం వెదికారు. స్టార్ హీరోయిన్స్ కోసం ట్రై చేశారు. కొత్త ముఖాల్ని కూడా పరిశీలించారు. ఎట్టకేలకు అఖిల్ సినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పూజా హెగ్డే, అఖిల్ సరసన హీరోయిన్ గా మెరవనుంది. ఈ మేరకు పూజా హెగ్డేకు ఫుల్ నెరేషన్ ఇచ్చాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. అటు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాత అల్లు అరవింద్ కూడా ముందుకొచ్చాడట. దీంతో పూజాహెగ్డే, ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. అందుకే స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో కైరా అద్వానీని తీసుకోవాలని భావించారు. అఖిల్ కూడా కైరాకే ఫిక్స్ అయ్యాడు. కానీ ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాతో బిజీ అవ్వడంతో పూజా హెగ్డే వైపు మొగ్గుచూపారు. అఖిల్-పూజా కాంబోలో ఇదే తొలి సినిమా.

కథ సంగతి పక్కనపెడితే.. రెమ్యూనరేషన్ కాస్త గిట్టుబాటు అయితే కాల్షీట్లు కేటాయించడానికి పూజాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాల్మీకి సినిమాలో కూడా ఆమె నటించడానికి పారితోషికమే కారణం. మేకర్స్ ఒప్పుకోకపోవచ్చు కానీ ఇదే నిజం. ఇప్పుడు అఖిల్ సినిమాకు కూడా పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి పారితోషికమే కారణం అని టాక్. ఈ సినిమా కోసం ఆమెకు కోటి 15 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందట.

ఈ సంగతి పక్కనపెడితే, అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమాకు ఎట్టకేలకు హీరోయిన్ అయితే దొరికేసింది. ఇక సినిమా షూటింగ్ పరుగులు పెట్టడం గ్యారెంటీ. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమాను ఈ ఏడాదిలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ కు ఇప్పటివరకు హిట్ తగల్లేదు. పూజా హెగ్డే రాకతోనైనా అతడికి సక్సెస్ వస్తుందేమో చూడాలి.

First Published:  27 Aug 2019 8:20 PM GMT
Next Story