Telugu Global
NEWS

ఐకానిక్‌ సోకులకు స్వస్తి.... 400 కోట్లు ఆదా

చంద్రబాబు అవసరాల కంటే సోకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మన సోకులు చూసి అందరూ ఆకర్షితులవుతారని ఆయన భావించారు. అందుకే అమరావతి ప్రాంతంలో అవసరం లేకున్నా చాలా సోకుల కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే కృష్ణానదిపై ఐకానిక్ వంతెన ఒకటి. హైదరాబాద్‌ నేషనల్‌ హైవేను… రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేసేందుకు కృష్ణా నదిపై చంద్రబాబు ఐకానిక్ వంతెన నిర్మిస్తామని అప్పట్లో చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి భారీగా హంగామా చేశారు. గొల్లపూడి వద్ద కృష్ణా నదిపై 3.1 కి.మీ. […]

ఐకానిక్‌ సోకులకు స్వస్తి.... 400 కోట్లు ఆదా
X

చంద్రబాబు అవసరాల కంటే సోకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మన సోకులు చూసి అందరూ ఆకర్షితులవుతారని ఆయన భావించారు. అందుకే అమరావతి ప్రాంతంలో అవసరం లేకున్నా చాలా సోకుల కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే కృష్ణానదిపై ఐకానిక్ వంతెన ఒకటి.

హైదరాబాద్‌ నేషనల్‌ హైవేను… రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేసేందుకు కృష్ణా నదిపై చంద్రబాబు ఐకానిక్ వంతెన నిర్మిస్తామని అప్పట్లో చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి భారీగా హంగామా చేశారు.

గొల్లపూడి వద్ద కృష్ణా నదిపై 3.1 కి.మీ. మేర ఆరు వరసలతో ఈ వంతెనను నిర్మించాల్సి ఉంది. సోకులు లేకుండా వంతెన నిర్మిస్తే 400 కోట్లతో నిర్మాణం పూర్తవుతుంది. కానీ ఐకానిక్ సోకులతో నిర్మిస్తే 800 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చారు.

అంటే సోకులకు అదనంగా 400 కోట్లు అవసరం. అయినా సరే చంద్రబాబు ఐకానిక్కే అన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రజాధనం వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఐకానిక్ వంతెన ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నారు.

ప్రజలకు సౌకర్యంగా ఉండేలా 400 కోట్లతోనే సాధారణ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. ఇలా ఆదా అయిన సొమ్ముతోనే ఇతర ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వంతెనలను నిర్మిస్తే బాగుంటుందన్నది ప్రభుత్వ ఆలోచన.

First Published:  26 Aug 2019 9:06 PM GMT
Next Story