Telugu Global
NEWS

గిరిజనులను ఆదుకుంటేనే.... మావోయిజం అదుపు " జగన్

దేశంలో మావోయిజం అదుపులో ఉండాలన్నా… గిరిజనులు మావోయిస్టుల వైపు ఆకర్షితులు కాకూడదన్నా గిరిజనులను అన్ని రంగాలలోనూ ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. “మావోయిస్టుల ప్రాభల్యం తగ్గాలంటే గిరిజనులకు అన్ని విధాలుగా ఆర్థిక పరిపుష్టిని కలుగజేయాలి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ […]

గిరిజనులను ఆదుకుంటేనే.... మావోయిజం అదుపు  జగన్
X

దేశంలో మావోయిజం అదుపులో ఉండాలన్నా… గిరిజనులు మావోయిస్టుల వైపు ఆకర్షితులు కాకూడదన్నా గిరిజనులను అన్ని రంగాలలోనూ ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు.

“మావోయిస్టుల ప్రాభల్యం తగ్గాలంటే గిరిజనులకు అన్ని విధాలుగా ఆర్థిక పరిపుష్టిని కలుగజేయాలి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు.

సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి పలు సూచనలు చేశారు.

గిరిజన ప్రాంతాలలో గిరిజన మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని సమావేశంలో సీఎం సూచించారు. “విజయనగరం జిల్లాలోని సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. గిరిజనులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోం మంత్రిత్వ శాఖ సమావేశంలో చెప్పారు.

గిరిజన ప్రాంతాలలో వివిధ కాంట్రాక్ట్ పనులలో 50 శాతం పనులను గిరిజనులకే అప్పగించాలని సూచించారు. “గిరిజనులను అభివృద్ధి పథం వైపు పరుగులు తీయిస్తే వారు మావోయిస్టుల వైపు చూడరు” అని సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశంలో తేల్చి చెప్పారు.

ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలు మావోయిస్టులను కట్టడి చేయడంలో సఫలం అయ్యాయని కితాబునిచ్చారు. గడచిన కొంత కాలంగా తెలుగు రాష్ట్ర్రాలలో మావోయిస్టుల ప్రభావం తగ్గిందని, దీనికి కారణం ఇక్కడి ప్రభుత్వాలు తీసుకున్న కఠిన నిర్ణయాలేనని అన్నారు.

వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు సమన్వయంతో పని చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

ఈ సమావేశంలో బిహార్, ఛత్తీస్ ఘడ్, ఒడిసా ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ నుంచి హోం మంత్రి మహమూద్ అలీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

First Published:  26 Aug 2019 8:37 PM GMT
Next Story