Telugu Global
NEWS

సుజనా సవాల్‌... భూముల వివరాలు బయటపెట్టిన బొత్స

రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని విషయంలో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు ఏ చిన్న కష్టం వచ్చినా తమ ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. రాజధాని రైతులు కౌలు కోసం డిమాండ్ చేస్తున్నారని… ఆ విషయం తెలియగానే వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. 8లక్షల క్కూసెక్కులకే రాజధాని ప్రాంతం మునిగిపోయిందని.. అదే 10 లక్షలు […]

సుజనా సవాల్‌... భూముల వివరాలు బయటపెట్టిన బొత్స
X

రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని విషయంలో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

రైతులకు ఏ చిన్న కష్టం వచ్చినా తమ ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. రాజధాని రైతులు కౌలు కోసం డిమాండ్ చేస్తున్నారని… ఆ విషయం తెలియగానే వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

8లక్షల క్కూసెక్కులకే రాజధాని ప్రాంతం మునిగిపోయిందని.. అదే 10 లక్షలు వచ్చి ఉంటే పరిస్థితి ఏమిటని తాను ఆందోళన వ్యక్తం చేయడంలో తప్పేంటని బొత్స ప్రశ్నించారు.

సుజనాచౌదరి బీజేపీ నేతలా కాకుండా ఇప్పటికీ టీడీపీ మేనేజర్‌గా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను గానీ, తన బంధువులు గానీ రాజధాని ప్రాంతంలో ఒక్క ఎకరం కొని ఉన్నా నిరూపించాలంటూ సుజనాచౌదరి సవాల్ చేసిన నేపథ్యంలో… సుజనా చౌదరి, ఆయన బినామీల ఆస్తుల వివరాలను కొన్నింటిని బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో చదివి వినిపించారు.

సుజనా చౌదరి అల్లుడు, కళింగ గ్రీన్‌టెక్‌ కంపెనీ డైరెక్టర్‌ జితిన్‌ కుమార్ పేరుతో చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు కొనుగోలు చేశారని వివరించారు. సుజనాచౌదరి సోదరుడి కుమార్తె రుషికన్య పేరుతో వీర్లపాడు మండలం బోగరాజుపాలెంలో 14 ఎకరాలు కొన్నారన్నారు. ఇవి కేవలం శాంపిల్ మాత్రమేనన్నారు. వందల ఎకరాలు రాజధానిలో కొనేశారన్నారు.

లోకేష్‌ తోడల్లుడి తండ్రికి ఏపీఐఐసీ ద్వారా తొలుత 493 ఎకరాలు అప్పగించారని.. అలా అప్పగించిన తర్వాత దాన్ని రాజధాని పరిధిలోకి తీసుకొచ్చారని వివరించారు. ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ కాదా అని ప్రశ్నించారు. ఇలా వందల ఎకరాలు ఉన్నాయని… ఆ వివరాలన్నింటిని త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామన్నారు. సుజనాచౌదరి సవాల్ చేసిన నేపథ్యంలో కొన్ని వివరాలను మాత్రమే బయటకు వివరిస్తున్నామన్నారు.

ఇలా భూములను కాజేశారు కాబట్టే రాజధాని అన్నది ఒక కులానికో, కొందరు వ్యక్తులకు చెందినదిగా ఉండకూదని తాను వ్యాఖ్యానించానన్నారు.

అమరావతిలో భూములు ధరలు పెరిగాయో, తగ్గాయో తనకు తెలియదని.. కానీ తిరుపతి, కాకినాడ, విశాఖ, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలలో మాత్రం భూముల ధరలు పెరిగాయన్నారు. చంద్రబాబు మాత్రం అవేవీ మాట్లాడకుండా ఒక్క అమరావతిలో భూముల ధరల గురించి మాత్రమే ఆందోళన చెందడం ఏమిటని ప్రశ్నించారు.

అమరావతిలో చంద్రబాబు భూములు ఉన్నాయి కాబట్టి…. అమరావతిలో భూములకు మాత్రమే ధరలుంటే చాలు అనుకుంటున్నారా? అని బొత్స ప్రశ్నించారు. రాజధాని ప్రకటించడానికి ముందే దళితులు, అమాయక రైతుల నుంచి భూములు రాయించుకున్న కొందరు పెద్దలకు సంబంధించి అన్ని వివరాలు ఉన్నాయన్నారు. అన్నీ త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామన్నారు బొత్స.

First Published:  27 Aug 2019 11:55 AM GMT
Next Story