Telugu Global
Cinema & Entertainment

విజయ్-పూరి.... క్యారెక్టర్ ఇదేనా?

ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో అనుకున్నంత విజయం సాధించలేకపోయిన విజయ్ దేవరకొండ… ఇప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఫాంలోకి వచ్చిన పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో కూడా ఒక యాక్షన్ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే పూరి-విజయ్ దేవరకొండ క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకి ‘ఫైటర్’ […]

విజయ్-పూరి.... క్యారెక్టర్ ఇదేనా?
X

ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో అనుకున్నంత విజయం సాధించలేకపోయిన విజయ్ దేవరకొండ… ఇప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఫాంలోకి వచ్చిన పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో కూడా ఒక యాక్షన్ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే పూరి-విజయ్ దేవరకొండ క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఫైటర్ టైటిల్ ను పూరి జగన్నాథ్ రిజిస్టర్ చేశారని సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్ర పోషించ బోతున్నాడని తెలుస్తోంది.

ఇక తన పాత్ర కోసం విజయ్ ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నాడట. ఈ సినిమాలో విజయ్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాకి బాలీవుడ్ హీరోయిన్ ని వెతికేపనిలో ఉన్నాడట పూరి జగన్నాథ్. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ల నుంది.

First Published:  26 Aug 2019 4:29 AM GMT
Next Story