Telugu Global
Cinema & Entertainment

ముచ్చటగా మూడోసారి

ఓ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అదే దర్శకుడికి మరో ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది హీరోలు వెనకాడతారు. కానీ ఫ్లాప్ ఇచ్చినప్పటికీ దర్శకుడి ప్రతిభపై కొంతమంది నమ్మకం ఉంచుతారు. అందుకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు. గతంలో గుణశేఖర్ కు మహేష్ అలానే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు కిషోర్ తిరుమలకు రామ్ కూడా ఇలానే ఛాన్స్ ఇస్తున్నాడు. రామ్ కు నేను శైలజ లాంటి గ్రాండ్ హిట్ ఇచ్చాడు కిషోర్ తిరుమల. కానీ ఆ వెంటనే ఉన్నది […]

ముచ్చటగా మూడోసారి
X

ఓ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అదే దర్శకుడికి మరో ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది హీరోలు వెనకాడతారు. కానీ ఫ్లాప్ ఇచ్చినప్పటికీ దర్శకుడి ప్రతిభపై కొంతమంది నమ్మకం ఉంచుతారు. అందుకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు. గతంలో గుణశేఖర్ కు మహేష్ అలానే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు కిషోర్ తిరుమలకు రామ్ కూడా ఇలానే ఛాన్స్ ఇస్తున్నాడు.

రామ్ కు నేను శైలజ లాంటి గ్రాండ్ హిట్ ఇచ్చాడు కిషోర్ తిరుమల. కానీ ఆ వెంటనే ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాతో ఫ్లాప్ కూడా ఇచ్చాడు. ఈ రెండు సినిమాలతో వీళ్లిద్దరి బంధం వీడిపోయిందని అంతా అనుకున్నారు. కానీ రామ్ కు మాత్రం కిషోర్ తిరుమలపై నమ్మకం ఉంది. అందుకే పిలిచి మరీ మరో ఛాన్స్ ఇచ్చాడు.

రీసెంట్ గా రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్, ఓ తమిళ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నారు. దాని పేరు తడమ్. ఈ రీమేక్ ను డైరక్ట్ చేసే బాధ్యతను కిషోర్ తిరుమలకు అప్పగించాడు రామ్. అంతా బాగానే ఉంది కానీ ఈ రీమేక్ ను కిషోర్ తిరుమల హ్యాండిల్ చేయగలడా అనేది అందరి డౌట్. సెన్సిబుల్ సినిమాలు తీసే దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు కిషోర్ తిరుమల. తడమ్ అనేది యాక్షన్ సబ్జెక్ట్. అదీ సంగతి.

First Published:  26 Aug 2019 11:02 AM GMT
Next Story