Telugu Global
NEWS

ఇసుక సిద్ధం... సక్రమ పంపిణియే పరమార్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సరఫరాకు మార్గం సుగమం అయ్యింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు ఇసుక పంపిణీ ఓ వరం అయ్యింది. ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇసుక రీచ్ లను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కోట్లాది రూపాయల అక్రమ సంపాదన అర్జించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నూతన ఇసుక విధానాన్ని తీసుకు వస్తామని ప్రకటించారు. అందుకు […]

ఇసుక సిద్ధం... సక్రమ పంపిణియే పరమార్ధం
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సరఫరాకు మార్గం సుగమం అయ్యింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు ఇసుక పంపిణీ ఓ వరం అయ్యింది. ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇసుక రీచ్ లను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కోట్లాది రూపాయల అక్రమ సంపాదన అర్జించారు.

దీనికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నూతన ఇసుక విధానాన్ని తీసుకు వస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా గడిచిన రెండు నెలలుగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అన్ని చర్యలు ప్రారంభించింది.

రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్ లలోను పుష్కలంగా ఇసుక చేరింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుకను ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 102 ఇసుక రీచ్ లను 47 షెడ్యూళ్లుగా విభజించి టెండర్లను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో షెడ్యూల్ లోను రెండు లేదా మూడు ఇసుక రీచ్ లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ రీచ్ లకు సంబంధించి టెండర్, రీటెండర్లను కూడా ఆహ్వానించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఒక్క టెండర్ మాత్రమే వచ్చిన ఇసుక రీచ్ లకు…. వాటిని రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఈ సంచలన నిర్ణయాల వెనక ప్రభుత్వ పారదర్శకత ఉందని ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు.

ప్రజలకు అందుబాటు ధరలో ఇసుకను అందజేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి గండి పడకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియాను కట్టడి చేయడంతో పాటు ప్రజలకు తక్కువ ధరకు…. వారు కోరినంత ఇసుకను సరఫరా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి కోరిన వారికి కోరినంత ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

First Published:  25 Aug 2019 10:16 PM GMT
Next Story