Telugu Global
National

కిడ్ని అమ్ముతానంటూ రైతు వాల్ పోస్టర్...

భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయం, పశుపోషణ పైనే చాలామంది ప్రజలు జీవిస్తున్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కొందరు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే…. మరొకొందరు శరీర అవయవాలు అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అందుకు ఒక ఉదాహరణ ఈ సంఘటన. ఉత్తర ప్రదేశ్ లోని ఒక రైతు బ్యాంకుల చుట్టూ అప్పు కోసం తిరిగి తిరిగి వేసారి పోయాడు. ఏ బ్యాంకు అతనికి అప్పు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో […]

కిడ్ని అమ్ముతానంటూ రైతు వాల్ పోస్టర్...
X

భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయం, పశుపోషణ పైనే చాలామంది ప్రజలు జీవిస్తున్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

కొందరు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే…. మరొకొందరు శరీర అవయవాలు అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అందుకు ఒక ఉదాహరణ ఈ సంఘటన.

ఉత్తర ప్రదేశ్ లోని ఒక రైతు బ్యాంకుల చుట్టూ అప్పు కోసం తిరిగి తిరిగి వేసారి పోయాడు. ఏ బ్యాంకు అతనికి అప్పు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో చివరికి ఉన్న అప్పులన్నీ తీర్చుకోవటానికి తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు.

చెత్తర్ శాలి గ్రామానికి చెందిన రామ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన’ కింద డైరీ ఫార్మింగ్ కోర్సును పూర్తి చేశాడు. ఒక చిన్న డైరీ ఫార్మ్ ను పెట్టుకోవడం కోసం బ్యాంక్ లోన్ ఇవ్వమని అడిగాడు. ఏ బ్యాంకూ అతడికి లోన్ ఇవ్వటానికి ముందుకు రాలేదు. రామ్ కుమార్ తన బంధువుల దగ్గర అప్పు చేసి ఒక షెడ్ నిర్మించి, కొన్ని పశువులను కొని వ్యాపారం ప్రారంభించాడు.

వ్యాపారం పుంజు కోకముందే అప్పుల వారు వడ్డీతో సహా బాకీ తీర్చమని కూర్చున్నారు. ఏం చేయాలో పాలుపోని రామ్ కుమార్ చివరికి తన కిడ్నీ అమ్మి బాకీ తీర్చాలని నిర్ణయించుకున్నాడు. తాను కిడ్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నానని, కావలసినవారు తనను సంప్రదించవచ్చని పోస్టర్లు ముద్రించాడు.

ఈ విషయంపై ఓ వార్తా సంస్థ సహరాన్పూర్ డివిజనల్ కమిషనర్ ని వివరణ అడగగా ఈ సంగతి ఏమి తనకు తెలియదని అన్నారు. దీనిమీద విచారణ జరిపించి రామ్ కుమార్ కి బ్యాంకులు ఎందుకు రుణం ఇవ్వలేదో కనుక్కుంటామని జవాబు ఇచ్చారు.

First Published:  24 Aug 2019 12:53 AM GMT
Next Story