Telugu Global
Health & Life Style

పంది గుండెని మనిషికి మార్చే రోజులొస్తున్నాయి...

భారత ప్రభుత్వ సర్వే ప్రకారం దాదాపు 5 లక్షల మంది ప్రజలు అవయవాల మార్పిడికి ఆర్గాన్స్ అందుబాటులో ఉండకపోవడం వల్ల మరణించారని తేలింది. లక్షా యాభై వేల మంది ప్రజలు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే కేవలం 5000 మందికి మాత్రమే మూత్రపిండాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇటువంటి అవయవాల కోసం ఇంకెంత మాత్రం ఏళ్లతరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదని ప్రఖ్యాత వైద్యుడు సర్ టెరెన్స్ ఇంగ్లీష్ అన్నారు. 2022 కల్లా […]

పంది గుండెని మనిషికి మార్చే రోజులొస్తున్నాయి...
X

భారత ప్రభుత్వ సర్వే ప్రకారం దాదాపు 5 లక్షల మంది ప్రజలు అవయవాల మార్పిడికి ఆర్గాన్స్ అందుబాటులో ఉండకపోవడం వల్ల మరణించారని తేలింది. లక్షా యాభై వేల మంది ప్రజలు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి ఎదురుచూస్తూ ఉన్నారు.

అయితే కేవలం 5000 మందికి మాత్రమే మూత్రపిండాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇటువంటి అవయవాల కోసం ఇంకెంత మాత్రం ఏళ్లతరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదని ప్రఖ్యాత వైద్యుడు సర్ టెరెన్స్ ఇంగ్లీష్ అన్నారు.

2022 కల్లా వరాహం గుండెను మనిషికి అమర్చే ప్రయోగాలు సక్సెస్ అవుతాయని ఇంగ్లీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. యునైటెడ్ కింగ్ డమ్ (యు కె) లో గుండె మార్పిడి చికిత్సలకు పేరుగాంచిన టెరెన్స్ ఇంగ్లీష్ 40 ఏళ్ల క్రితం మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్స చేశారు.

ఈయన అప్పట్లోనే పంది మూత్రపిండం మనిషికి మార్చే అవకాశం గురించి చెప్పారు. మనిషికి పంది మూత్రపిండం మార్చడం సాధ్యపడితే గుండెను కూడా మార్చటం సాధ్యమేనని ఆయన అంటున్నారు.

టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… “పంది మూత్రపిండం మనిషికి మార్చడం సక్సెస్ అయితే, పంది గుండెను మనిషికి కొన్ని సంవత్సరాల్లోనే మార్చటం సాధ్యపడుతుంద”ని 87 ఏళ్ల సర్ టెరెన్స్ అంటున్నారు.

పంది గుండె… ఆకారంలోనూ, నిర్మాణంలోనూ మనిషి గుండెను పోలి ఉంది. ఈ యేడాది మే నెలలో కార్డియాక్ అరెస్ట్ వల్ల దెబ్బతిన్న గుండెకు మైక్రో ఆర్.ఎన్.ఎ- 199 అనే జెనెటిక్ పదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా శరీరంలోనికి పంపించినప్పుడు… నెల రోజుల్లోనే దెబ్బతిన్న గుండె మామూలైంది.

టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా త్రీడీ ప్రింటెడ్ గుండెను సృష్టించారు. ఇందుకోసం కణాలను, జీవ పదార్థాన్ని ఉపయోగించుకున్నారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న అనేకమంది పేషెంట్లకు ఇటువంటి గుండెలు ఎంతో అవసరమని సర్ టెరెన్స్ ఇంగ్లీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

First Published:  22 Aug 2019 4:37 AM GMT
Next Story