Telugu Global
International

యజమాని తో పాటు ప్రాణాలొదిలిన కుక్క

మానవునికి, కుక్కకి మధ్య ఉండే అవినాభావ సంబంధం ఇప్పటిది కాదు. అత్యంత విశ్వసనీయమైన జంతువుగా యుగ యుగాలుగా అది తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. విశ్వాసమే కాదు కొన్ని కుక్కలు తమ యజమానితో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంటాయి. ఎంతగా అంటే యజమాని మరణిస్తే తానూ ప్రాణాలు వదిలేంతగా… ‘స్టువార్ట్ హట్చిన్సన్’ 25 ఏళ్ల కుర్రవాడు. 2011లో అతడికి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది. అప్పటి నుంచి అతనికి ఎంతో విశ్వసనీయమైన ఓ కుక్క స్నేహంగా ఉంటూ […]

యజమాని తో పాటు ప్రాణాలొదిలిన కుక్క
X

మానవునికి, కుక్కకి మధ్య ఉండే అవినాభావ సంబంధం ఇప్పటిది కాదు. అత్యంత విశ్వసనీయమైన జంతువుగా యుగ యుగాలుగా అది తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. విశ్వాసమే కాదు కొన్ని కుక్కలు తమ యజమానితో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంటాయి. ఎంతగా అంటే యజమాని మరణిస్తే తానూ ప్రాణాలు వదిలేంతగా…

‘స్టువార్ట్ హట్చిన్సన్’ 25 ఏళ్ల కుర్రవాడు. 2011లో అతడికి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది. అప్పటి నుంచి అతనికి ఎంతో విశ్వసనీయమైన ఓ కుక్క స్నేహంగా ఉంటూ వచ్చింది. ఆ ఫ్రెంచ్ బుల్ డాగ్ పేరు ‘నీరో’.

అతడు చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా ‘నీరో’ అతడితోనే ఉంది. హట్చిన్సన్ మరణించిన పదిహేను నిమిషాల్లోనే ‘నీరో’ కూడా చనిపోయింది. మంగళవారం ఇంగ్లాండు లో జరిగింది ఈ సంఘటన.

హట్చిన్సన్ చాలాసార్లు కీమోథెరపీ తీసుకున్నా క్యాన్సర్ ఎముకలకు వ్యాపించింది. దీంతో మరో ప్రమాద కరమైన ట్యూమర్ పుట్టుకొచ్చి చనిపోయాడు.

విషాద సముద్రం లో మునిగి ఉన్న హట్చిన్సన్ తల్లి ఫియోన కొనఘన్ మట్లాడుతూ… “రాత్రి 1.15 నా కుమారుడు మరణిస్తే… దాదాపు మరో 15 నిమిషాల్లోనే ‘నీరో’ కూడా చనిపోయింది. మా అబ్బాయి మూడు కుక్కల్ని పెంచుకుంటున్నాడు. అందులో ‘నీరో’ అంటే అతడికి చాలా ఇష్టం. అదికూడా వాడిని వదిలి ఉండేది కాదు. వాళ్లిద్దరూ ఒకే మనిషి లా జీవిస్తున్నారు. నీరో ఎప్పుడూ అతడితోనే ఉంటుంది” అని చెప్పింది.

హట్చిన్సన్ ని ఒక నెల క్రితమే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకు వచ్చారు. తాను హాస్పిటల్ లో కాకుండా ఇంటి దగ్గరే మరణించాలని అతడి కోరిక.

“ఇంట్లో అతడిని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఇది మేము అనుకున్నదే. ఎదురు చూస్తూ ఉన్నది రానే వచ్చింది. మా గుండెల్ని పిండేసింది”అని ఫియోనా కుమిలి పోతున్నది. తన కుమారునికి అత్యంత ఇష్టమైన ‘నీరో’ కూడా మరణించడం మరింత బాధించిందని ఆమె వాపోతున్నది.

First Published:  22 Aug 2019 3:50 AM GMT
Next Story