Telugu Global
NEWS

బొత్స వ్యాఖ్యలు నాడు బాబు చెప్పినవే

మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశం తెరపైకి వచ్చింది. అమరావతిలో రాజధాని నిర్మాణం వల్ల ఖర్చు రెట్టింపు అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల కృష్ణా నదికి వరదలు వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతం నీట మునిగిన అంశాన్ని కూడా ప్రస్తావించిన బొత్స… పలు అంశాలపై లోతుగా చర్చించి ప్రభుత్వం త్వరలోనే రాజధాని నిర్మాణంపై ప్రకటన చేస్తుందని చెప్పారు. దీంతో చంద్రబాబు అండ్ టీం ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టింది. బొత్స వ్యాఖ్యలను […]

బొత్స వ్యాఖ్యలు నాడు బాబు చెప్పినవే
X

మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశం తెరపైకి వచ్చింది. అమరావతిలో రాజధాని నిర్మాణం వల్ల ఖర్చు రెట్టింపు అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది.

ఇటీవల కృష్ణా నదికి వరదలు వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతం నీట మునిగిన అంశాన్ని కూడా ప్రస్తావించిన బొత్స… పలు అంశాలపై లోతుగా చర్చించి ప్రభుత్వం త్వరలోనే రాజధాని నిర్మాణంపై ప్రకటన చేస్తుందని చెప్పారు.

దీంతో చంద్రబాబు అండ్ టీం ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టింది. బొత్స వ్యాఖ్యలను బట్టి జగన్‌ ప్రభుత్వం రాజధానిని తరలించేందుకు కుట్ర చేస్తోందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మంగళవారం మీడియా సమావేశంలో బొత్స చెప్పిన విషయాలేవీ కొత్తవి కావు. ప్రత్యక్షంగా, పరోక్షంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వమే వివిధ వేదికల మీద ఈ అంశాలన్నింటిని…. అంగీకరించింది.

బొత్స తన ప్రెస్‌మీట్‌లో అమరావతి ముంపును ప్రముఖంగా ప్రస్తావించారు. వరద వస్తే అమరావతి ప్రాంతం మునిగిపోతదని… కాబట్టి వరదల నుంచి రాజధాని ప్రాంతాన్ని కాపాడాలంటే కాలువలు, ప్రాజెక్టులు, డ్యాంలు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు.

కాస్త వెనక్కు వెళ్తే ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా అంగీకరించింది. ముంపు ప్రాంతంలో అమరావతిని నిర్మిస్తున్నారని దాన్ని అడ్డుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో అప్పట్లో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఏపీ ప్రభుత్వమే అమరావతి ప్రాంతంలో 10వేల ఎకరాలకు ముంపు ముప్పు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించింది.

మరి అలాంటి చోట రాజధాని ఎలా నిర్మిస్తారని ఎన్‌జీటీ ప్రశ్నించగా… ఆ 10 వేల ఎకరాల ముంపు ప్రాంతాన్ని 25 అడుగుల మేర మట్టితో పూడ్చి పైకి లేపుతామని ఏపీ ప్రభుత్వమే ప్రకటించింది.

ఆ సమయంలోనే ఐక్యరాజ్యసమితి కన్సల్టెంట్, ప్రముఖ ఇంజనీర్ టీ హనుమంతరావు కూడా… ప్రస్తుత ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఏమాత్రం సురక్షితం కాదని… ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు.

ఒకవేళ చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతంలో ఎవరైనా భవనాలు కట్టుకోవాలంటే… హఠాత్తుగా వచ్చే ముంపు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తొలి రెండు అంతస్తుల్లో నివాసం ఉండకుండా ఇతర అవసరాలకు వాడుకోవడం బెటర్ అని ఆయన అప్పుట్లో సూచించారు.

బొత్స సత్యనారాయణ… చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతంలో నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నదని… లక్ష రూపాయలు ఖర్చు అయ్యే పనికి రెండు లక్షలు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఇది కూడా బొత్స సత్యనారాయణ కనిపెట్టి చెప్పిందేమీ కాదు.

రాజధాని ప్రాంతం గట్టి నేల కాకపోవడంతో రెండు అంతస్తుల సచివాలయం నిర్మాణానికి 33 మీటర్ల మేర…. పిల్లర్లు వేశామని ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. రెండు అంతస్తుల భవనానికే అంతలోతుకు పునాది తీయాల్సి వస్తే… ఇక బాబు గ్రాఫిక్స్ లో చూపించిన ఆకాశాన్ని తాకేంత అంతస్తులు కట్టాలంటే ఎంతగా శ్రమించాలి?

రాజధానిని ముంపు నుంచి కాపాడేందుకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది, కాలువలు తవ్వాల్సి ఉంటుందని బొత్స చెప్పారు. కొండవీటి వాగు ముప్పు ఎప్పటికీ పొంచే ఉంది. భారీ వరదలు వస్తే…. తక్షణసాయం చేయడానికి కూడా అవకాశం ఉండని పరిస్థితి.

ఇప్పటికే కొండవీటి వాగుపై…. ముంపునుంచి రాజధానిని కాపాడుతానంటూ ఒక ఎత్తిపోతల పథకాన్ని కూడా చంద్రబాబు సిద్దం చేసిన అంశాన్ని కూడా గుర్తుచేస్తున్నారు.

అయితే గత వారం వచ్చింది కేవలం కృష్ణమ్మ వరద ప్రవాహమే…. ఒకవేళ స్థానికంగానూ భారీ వర్షాలు కురిసి కొండవీటి వాగు కూడా పొంగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. చంద్రబాబు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని ఎంతగా వాదించినా… అక్కడ వాస్తవ పరిస్థితి వేరు.

First Published:  21 Aug 2019 10:26 AM GMT
Next Story