Telugu Global
NEWS

ప్రభాస్‌పై టీడీపీ నెగిటివ్‌ క్యాంపెయిన్‌... స్పందించిన లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం అలవాటుగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరో ప్రభాస్… ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను ప్రశంసించారు. దీంతో టీడీపీ అభిమానులకు కోపం వచ్చింది. కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ సాహో సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది టీడీపీ పెద్దల ఆదేశాలతో మొదలైందన్న వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఊహించని రీతిలో అటాక్ […]

ప్రభాస్‌పై టీడీపీ నెగిటివ్‌ క్యాంపెయిన్‌... స్పందించిన లోకేష్
X

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం అలవాటుగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరో ప్రభాస్… ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను ప్రశంసించారు. దీంతో టీడీపీ అభిమానులకు కోపం వచ్చింది. కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ సాహో సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది టీడీపీ పెద్దల ఆదేశాలతో మొదలైందన్న వార్తలూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఊహించని రీతిలో అటాక్ మొదలైంది.

ఈ నేపథ్యంలో నారా లోకేష్ నష్టనివారణ కోసం స్పందించారు. సాహోకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిందిగా టీడీపీ పెద్దలు ఆదేశించారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయవద్దని కోరారు.

పనిలో పనిగా సాహో విడుదల కోసం తామంతా ఎదురుచూస్తున్నామని లోకేష్ చెప్పారు. టీడీపీ అభిమానులు కూడా సాహో చిత్రాన్ని వీక్షించాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు లోకేష్.

First Published:  19 Aug 2019 8:32 PM GMT
Next Story