Telugu Global
National

నో డెబిట్ కార్డ్... ఓన్లీ డిజిటల్ " ఎస్ బీ ఐ నిర్ణయం

దేశంలో డెబిట్ కార్డుల వినియోగాన్ని క్రమేణా తగ్గించాలని, వాటి స్థానంలో డిజిటల్ లావాదేవీలకు పెద్దపీట వేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ఆ బ్యాంకు నిర్ణయించింది. సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల వార్షిక సమావేశంలో డెబిట్ కార్డుల వినియోగం తగ్గింపు, డిజిటల్ లావాదేవీల పెంపు అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ డెబిట్ కార్డుల […]

నో డెబిట్ కార్డ్... ఓన్లీ డిజిటల్  ఎస్ బీ ఐ నిర్ణయం
X

దేశంలో డెబిట్ కార్డుల వినియోగాన్ని క్రమేణా తగ్గించాలని, వాటి స్థానంలో డిజిటల్ లావాదేవీలకు పెద్దపీట వేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ఆ బ్యాంకు నిర్ణయించింది.

సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల వార్షిక సమావేశంలో డెబిట్ కార్డుల వినియోగం తగ్గింపు, డిజిటల్ లావాదేవీల పెంపు అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ డెబిట్ కార్డుల వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు.

“మేము డెబిట్ కార్డుల వినియోగాన్ని తగ్గించాలి అనుకుంటున్నాం. దీని స్థానంలో డిజిటల్ లావాదేవీలను పెంచాలన్నదే మా లక్ష్యం. ఇది కష్ట సాధ్యమైన ప్రక్రియ కావచ్చు. కానీ సాధించలేనిది మాత్రం కాదు” అని రజనీష్ కుమార్ ప్రకటించారు.

డెబిట్ కార్డుల వినియోగం తగ్గించడం సాధ్యమేనని, ఇందుకోసం తమ “యోనో” వంటి డిజిటల్ ప్లాట్ ఫారంలను ఉపయోగించుకోవచ్చని రజనీష్ కుమార్ తెలిపారు. అసలు డెబిట్ కార్డు అవసరం లేకుండా తమ యోనో ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చునని, ఎవరికైనా ఎక్కడి నుంచైనా చెల్లింపులు చేయవచ్చునని ఆయన తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 90 కోట్ల వరకు డెబిట్ కార్డులు ఉన్నాయని, మూడు కోట్ల వరకు క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయని రజనీష్ కుమార్ తెలిపారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 59 నిమిషాలకే రుణ మంజూరు పథకం పట్ల చిన్నవ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని, అయినా వాహనాలకు ఈ రుణ పథకాన్ని వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

25 కోట్ల రూపాయల రుణాన్ని పొందాలనుకున్న వ్యాపారవేత్త ఈ 59 నిమిషాల రుణ మంజూరు అనే నూతన విధానం ద్వారా 5 కోట్ల రూపాయల వరకూ రుణాన్ని పొందే అవకాశం ఉందని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.

First Published:  20 Aug 2019 12:28 AM GMT
Next Story