Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ దర్శకుడు... సినిమా అనుకున్నాడు... కానీ వెబ్ సిరీస్ అయింది!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను తీసిన దర్శకులలో మెహర్ రమేష్ కూడా ఒకరు. ‘కంత్రి’, ‘బిల్లా’, ‘షాడో’ వంటి సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మెహర్ రమేష్ ఇండస్ట్రీలో మంచి నెట్వర్క్ నే సంపాదించాడు… కానీ ఒక్క మంచి హిట్ సినిమాను కూడా ఇవ్వలేకపోయాడు. గత కొంత కాలంగా మహేష్ బాబు తో సన్నిహితంగా ఉంటున్న మెహర్ రమేష్ సూపర్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన […]

ఫ్లాప్ దర్శకుడు... సినిమా అనుకున్నాడు... కానీ వెబ్ సిరీస్ అయింది!
X

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను తీసిన దర్శకులలో మెహర్ రమేష్ కూడా ఒకరు. ‘కంత్రి’, ‘బిల్లా’, ‘షాడో’ వంటి సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మెహర్ రమేష్ ఇండస్ట్రీలో మంచి నెట్వర్క్ నే సంపాదించాడు… కానీ ఒక్క మంచి హిట్ సినిమాను కూడా ఇవ్వలేకపోయాడు.

గత కొంత కాలంగా మహేష్ బాబు తో సన్నిహితంగా ఉంటున్న మెహర్ రమేష్ సూపర్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈసారి మెహర్ రమేష్ సినిమాలతో కాకుండా ఒక వెబ్ సిరీస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే మహేష్ బాబు భార్య నమ్రత కొన్ని వెబ్ సిరీస్ లకి సంబంధించిన స్క్రిప్ట్ లను ఫైనలైజ్ చేశారు. సరైన భాగస్వామి దొరికితే ఆ వెబ్ సిరీస్ నిర్మించడానికి ఆమె సిద్ధంగా ఉంది.

ముందుగా అలాంటి ఒక స్క్రిప్ట్ కి ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ ని దర్శకుడిగా అనుకున్నారు…. కానీ అతను ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. జగపతి బాబు ఈ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించే అవకాశం ఇప్పుడు మెహర్ రమేష్ కు దక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

First Published:  20 Aug 2019 12:46 AM GMT
Next Story