Telugu Global
NEWS

భద్రంగా ఉంచేందుకే అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ నా ఇంట్లో పెట్టుకున్నా...

అసెంబ్లీకి సంబంధించిన కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను దొంగగా తన ఇంట్లో పెట్టుకున్న అంశం వెలుగులోకి రావడంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కంగుతిన్నారు. కేసు నమోదుకు పోలీసులు సిద్దమవడంతో వివరణ ఇచ్చుకున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కోడెల… కంప్యూటర్లు, ఫర్నీచర్లు భద్రంగా ఉండాలనే తాను తన ఇంట్లో పెట్టుకున్నానని సెలవిచ్చారు. అసెంబ్లీని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించిన సమయంలో కంప్యూటర్లు, ఫర్నీచర్ హైదరాబాద్‌లోనే వదిలేస్తే వాటికి భద్రత ఉండదన్న ఉద్దేశంతోనే తాను తన ఇంటికి తీసుకెళ్లానని చెప్పారు. […]

భద్రంగా ఉంచేందుకే అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ నా ఇంట్లో పెట్టుకున్నా...
X

అసెంబ్లీకి సంబంధించిన కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను దొంగగా తన ఇంట్లో పెట్టుకున్న అంశం వెలుగులోకి రావడంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కంగుతిన్నారు. కేసు నమోదుకు పోలీసులు సిద్దమవడంతో వివరణ ఇచ్చుకున్నారు.

మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కోడెల… కంప్యూటర్లు, ఫర్నీచర్లు భద్రంగా ఉండాలనే తాను తన ఇంట్లో పెట్టుకున్నానని సెలవిచ్చారు.

అసెంబ్లీని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించిన సమయంలో కంప్యూటర్లు, ఫర్నీచర్ హైదరాబాద్‌లోనే వదిలేస్తే వాటికి భద్రత ఉండదన్న ఉద్దేశంతోనే తాను తన ఇంటికి తీసుకెళ్లానని చెప్పారు. అవన్నీ తన వద్దే ఉన్నాయని అంగీకరించారు.

వాటిని తిరిగి అప్పగించేందుకు తాను సిద్ధమని… లేదంటే వాటి విలువ చెబితే డబ్బు చెల్లించేందుకూ తనకు అభ్యంతరం లేదన్నారు.

అయితే స్పీకర్‌ పదవి నుంచి దిగిపోయిన తర్వాత…. స్వచ్చందంగా ఫర్నీచర్, కంప్యూటర్లు ఎందుకు తిరిగి ఇవ్వలేదన్న దానిపై మాత్రం సమాధానం లేదు. ఇప్పటికి అధికారులు గుర్తించారు కాబట్టి సరిపోయిందని… లేదంటే అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ శాశ్వతంగా కోడెల ఇంటిలోనే ఉండిపోయేవి అని భావిస్తున్నారు.

First Published:  20 Aug 2019 4:43 AM GMT
Next Story