Telugu Global
NEWS

షోరూమ్‌ లోనూ అసెంబ్లీ ఫర్నీచరే.... తీగ దొరికింది అక్కడే....

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ చేసిన అవినీతి, అక్రమ దందాలపై రాజకీయ పార్టీల నాయకులే కాదు.. రాజకీయ విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు. “రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న…. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు శాసనసభ ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి ఆయన ఇంటికి తీసుకుపోవడం స్పీకర్ పదవిని అనుభవించిన కోడెల శివప్రసాద్ కు సిగ్గు చేటు” అని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్న సమయంలో కోడెల శివప్రసాద్ […]

షోరూమ్‌ లోనూ అసెంబ్లీ ఫర్నీచరే.... తీగ దొరికింది అక్కడే....
X

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ చేసిన అవినీతి, అక్రమ దందాలపై రాజకీయ పార్టీల నాయకులే కాదు.. రాజకీయ విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు.

“రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న…. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు శాసనసభ ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి ఆయన ఇంటికి తీసుకుపోవడం స్పీకర్ పదవిని అనుభవించిన కోడెల శివప్రసాద్ కు సిగ్గు చేటు” అని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్న సమయంలో కోడెల శివప్రసాద్ చేసిన అనేక దారుణాలపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చాగోష్టిలో తెలకపల్లి రవి సహా నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బీజెవైఎం జాతీయ నాయకుడు షేక్ బాజీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి మాట్లాడుతూ…. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఫర్నీచర్ రాష్ట్ర్రం విడిపోయిన తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని, ఆ ఫర్నీచర్ కు చారిత్రక గుర్తింపు ఉందని, దానిని కూడా పట్టించుకోకుండా కోడెల శివప్రసాద రావు ఫర్నీచర్ ను తన ఇంటికి తీసుకుపోవడం దారుణమని అన్నారు.

“స్పీకర్ గా కోడెల శివప్రసాద రావు చేసిన దారుణాలను దయచేసి బయటపెట్టకండి. ఇప్పటికే చాలా అగౌరవంగా భావిస్తున్నాం. మరిన్ని అవినీతి, అక్రమాలు వెల్లడించి స్పీకర్ పదవికి అప్రతిష్ట తీసుకురాకండి” అని తెలకపల్లి రవి అన్నారు.

చర్చలో పాల్గొన్న నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ…. స్పీకర్ గా కోడెల శివప్రసాద రావు నరసారావు పేట పరువు తీసారన్నారు.

“మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన ఘన కార్యాలయాల వల్ల నరసారావుపేట ప్రజలు తల దించుకుంటున్నారు” అని అన్నారు.

శాసనసభకు చెందిన ఫర్నీచర్ ను కోడెల శివప్రసాద రావు ఇంటికి తరలించిన వ్యవహారంలో సహకరించిన అధికారులపై కూడా దర్యాప్తు జరుగుతుందని శ్రీనివాస రెడ్డి అన్నారు.

కోడెల శివప్రసాదరావు కుమారుడి బైక్ షోరూంలో శాసనసభకు చెందిన ఫర్నీచర్ ను వాడుకున్నారని, వెయ్యి మోటారు బైక్ లకు టాక్స్ కట్టని కేసులో ఆ షోరూంని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు…. శాసనసభ ఫర్నీచర్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు.

చివరకు ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఐ ఫోన్ లను కూడా పాడైపోయాయంటూ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులు అమ్ముకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

చర్చలో పాల్గొన్న భారతీయ జనతా యువమోర్చ జాతీయ నాయకుడు షేక్ బాజీ మాట్లాడుతూ… స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని కోడెల శివప్రసాద రావు కుటుంబం అడ్డగోలుగా సంపాదించిందని అన్నారు.

“టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రామా పార్టీ అని నేడు రుజువైంది” అని అన్నారు. అన్న క్యాంటీన్ల మూసివేతపై ధర్నాలు చేస్తున్న తెలుగుదేశం నాయకులకు అక్కడి భోజనాన్ని కోడెల శివప్రసాద రావు ఆయన కంపెనీల్లో పని చేస్తున్న వారికి అమ్ముకున్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు.

ఇక శాసనసభ్యులకు ఇవ్వాల్సిన మందులు కూడా కోడెల శివప్రసాదరావు తన కుమార్తె ఆసుపత్రికి తరలించారని…. ఇంతటి ఘోరం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర స్పీకర్ చేయలేదని అన్నారు.

First Published:  20 Aug 2019 10:39 AM GMT
Next Story