Telugu Global
Cinema & Entertainment

టీజర్ తో అంచనాలు పెంచేస్తున్న 'వాల్మీకి'

ఈ మధ్యనే ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ తో చేతులు కలిపి ‘వాల్మీకి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అథర్వ మురళి మరియు పూజాహెగ్డే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ప్రీటీజర్ లో వరుణ్ తేజ్ గ్యాంగ్ […]

టీజర్ తో అంచనాలు పెంచేస్తున్న వాల్మీకి
X

ఈ మధ్యనే ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ తో చేతులు కలిపి ‘వాల్మీకి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అథర్వ మురళి మరియు పూజాహెగ్డే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ప్రీటీజర్ లో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ అవతారంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ వీడియో అథర్వ మురళి “నా సినిమాకి నా విలనే నా హీరో” అని అనటంతో మొదలుపెట్టారు. ఇక వరుణ్ తేజ్ టీజర్ తో సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు.

టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతుందని చెప్పవచ్చు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

First Published:  16 Aug 2019 1:14 AM GMT
Next Story