Telugu Global
Cinema & Entertainment

ఇక కాజల్ కెరీర్ ముగిసినట్టేనా?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులతో నెట్టుకొస్తోంది. ఈ మధ్యనే ఈమె నటించిన ‘కవచం’ , ‘సీత’ సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. ఇక అన్ని ఆశలు శర్వానంద్ హీరోగా నటించిన ‘రణరంగం’ సినిమా పైనే పెట్టుకుంది ఈ భామ. కనీసం ఈ సినిమాతోనైనా కాజల్ అగర్వాల్ కెరీర్ లో మార్పు వస్తుందేమో అని అందరూ అనుకున్నారు. ‘రణరంగం’ సినిమా […]

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులతో నెట్టుకొస్తోంది.

ఈ మధ్యనే ఈమె నటించిన ‘కవచం’ , ‘సీత’ సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. ఇక అన్ని ఆశలు శర్వానంద్ హీరోగా నటించిన ‘రణరంగం’ సినిమా పైనే పెట్టుకుంది ఈ భామ. కనీసం ఈ సినిమాతోనైనా కాజల్ అగర్వాల్ కెరీర్ లో మార్పు వస్తుందేమో అని అందరూ అనుకున్నారు. ‘రణరంగం’ సినిమా కూడా విడుదలైంది… కానీ ఈ సినిమా క్రెడిట్ లో కొంచెం కూడా కాజల్ అగర్వాల్ కి దక్కలేదు.

సినిమా హిట్ అవడం గురించి పక్కన పెడితే అసలు ఈమె ఈ సినిమాను ఎందుకు ఒప్పుకుంది అంటూ అభిమానులు సైతం మండిపడుతున్నారు. ఒకవైపు ఆమె పాత్రకి ప్రాధాన్యత లేదు, మరోవైపు పర్ఫామెన్స్ కి కూడా స్కోప్ లేదు.

అలాంటిది అంత చిన్న పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ఎలా ఒప్పుకుంది అంటూ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

అయితే పరిస్థితులు చూస్తుంటే మాత్రం కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసిపోతున్నట్టే అని కొందరు చెబుతున్నారు.

First Published:  16 Aug 2019 3:30 AM GMT
Next Story