Telugu Global
Cinema & Entertainment

ఎవరు మొదటి రోజు వసూళ్లు

వరుస విజయాలతో ఊపుమీదున్న అడవి శేష్, అదే ఊపులో ఎవరు సినిమాతో మరో సక్సెస్ కొట్టేశాడు. చాలా పకడ్బందీగా ప్రచారం చేయడంతో పాటు.. ట్రయిలర్ తో కూడా హిట్ కొట్టడం ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. అలా మొదటి రోజు ఎవడు సినిమాకు కోటి 60లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ హీరో కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ ఓపెనర్. రిలీజ్ కు ముందే ట్రయిలర్ తో హిట్ కొట్టిన ఈ హీరో, రిలీజ్ తర్వాత […]

ఎవరు మొదటి రోజు వసూళ్లు
X

వరుస విజయాలతో ఊపుమీదున్న అడవి శేష్, అదే ఊపులో ఎవరు సినిమాతో మరో సక్సెస్ కొట్టేశాడు. చాలా పకడ్బందీగా ప్రచారం చేయడంతో పాటు.. ట్రయిలర్ తో కూడా హిట్ కొట్టడం ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. అలా మొదటి రోజు ఎవడు సినిమాకు కోటి 60లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ హీరో కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ ఓపెనర్.

రిలీజ్ కు ముందే ట్రయిలర్ తో హిట్ కొట్టిన ఈ హీరో, రిలీజ్ తర్వాత సినిమాతో కూడా హిట్ కొట్టాడు. శనివారం, ఆదివారం ఈ సినిమాకు భారీ వసూళ్లు ఆశిస్తున్నారు.

ఏపీ, నైజాంలో ఈ సినిమాను 7 కోట్ల రూపాయలకు అమ్మారు. మరో వారం రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి.

నిజానికి ఈ టాక్ తో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 3 రోజులు చాలు. కానీ ఎవరు సినిమాను చాలా తక్కువ థియేటర్లలో విడుదల చేశారు. అందుకే వారం రోజులు పట్టే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్స్ ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 0.64 కోట్లు
సీడెడ్ – రూ. 0.16 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.21 కోట్లు
ఈస్ట్ – రూ. 0.21 కోట్లు
వెస్ట్ – రూ. 0.08 కోట్లు
గుంటూరు – రూ. 0.13 కోట్లు
కృష్ణా – రూ. 0.15 కోట్లు
నెల్లూరు – రూ. 0.04 కోట్లు

First Published:  16 Aug 2019 8:57 AM GMT
Next Story