Telugu Global
Cinema & Entertainment

బండ్ల గణేష్ ‘7ఓ క్లాక్ బ్లేడ్’... అప్పుడు రాజకీయాల్లో... ఇప్పుడు ఇలా...

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల వేళ సెగలు పుట్టించిన ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో కామెడీ పండించిన రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారంటే అది కేఏ పాల్, బండ్ల గణేష్ మాత్రమే. యూట్యూబ్ స్టార్ లుగా వీరు మారిపోయారు. కేఏపాల్ చిత్రవిచిత్రమైన కామెడీ వేషాలు, చేష్టలు వైరల్ గా మారాయి. ఇక బండ్ల గణేష్ తెలంగాణ కాంగ్రెస్ నేతగా మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకపోతే గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్ డైలాగ్ పాపులర్ అయ్యింది. అయితే […]

బండ్ల గణేష్ ‘7ఓ క్లాక్ బ్లేడ్’... అప్పుడు రాజకీయాల్లో... ఇప్పుడు ఇలా...
X

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల వేళ సెగలు పుట్టించిన ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో కామెడీ పండించిన రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారంటే అది కేఏ పాల్, బండ్ల గణేష్ మాత్రమే. యూట్యూబ్ స్టార్ లుగా వీరు మారిపోయారు.

కేఏపాల్ చిత్రవిచిత్రమైన కామెడీ వేషాలు, చేష్టలు వైరల్ గా మారాయి. ఇక బండ్ల గణేష్ తెలంగాణ కాంగ్రెస్ నేతగా మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.

తెలంగాణలో కాంగ్రెస్ గెలవకపోతే గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్ డైలాగ్ పాపులర్ అయ్యింది. అయితే కాంగ్రెస్ ఓడిపోవడం.. ఆ తర్వాత బండ్ల రాజకీయ సన్యాసం తీసుకొని సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం మళ్లీ సినిమా అవకాశం రావడంతో నటిస్తున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీలో బండ్ల గణేష్ నటిస్తున్నాడు. సీరియస్ కామెడీ పొలిటీషన్ నుంచి హాస్యనటుడిగా మారిన బండ్ల గణేష్ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీతో…. మహేష్ సినిమాలో అద్భుతమైన కామెడీ పండించారని టాక్ నడుస్తోంది. బండ్ల కోసం ప్రత్యేకంగా అనిల్ రావిపూడి ‘7ఓ క్లాక్ బ్లేడ్’ కామెడీ ట్రాక్ రాశాడని సమాచారం.

తాజాగా బండ్ల గణేష్, అనిల్ రావిపూడి, హీరోయిన్ రష్మిక మందానా, చిత్రం యూనిట్ తో ఒక ఫొటో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ ఫొటోలో బండ్ల గణేష్ బ్లేడ్ ను మెడలో చైన్ లా వేసుకోవడం కనిపించింది. దీన్ని బట్టి బండ్ల పాత్రను ఆయన పేల్చిన ‘కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్న’ డైలాగ్ తోనే దర్శకుడు కామెడీ ట్రాక్ రాసుకున్నట్టు అర్థమవుతోంది.

First Published:  16 Aug 2019 3:42 AM GMT
Next Story