Telugu Global
Cinema & Entertainment

అనుష్కపై మరోసారి స్పందించిన ప్రభాస్

తామిద్దరి మధ్య స్నేహం తప్ప మరేం లేదని ఇప్పటికీ ప్రభాస్, అనుష్క చాలాసార్లు ప్రకటించారు. రీసెంట్ గా సాహో ప్రచారం ప్రారంభించిన ప్రభాస్ కూడా దీనిపై చాలాసార్లు రియాక్ట్ అయ్యాడు. అనుష్క తనకు స్నేహితురాలు మాత్రమేనని, అంతకుమించి అనుబంధం లేదని తెలిపాడు. కానీ పుకార్లు ఆగకపోవడంతో ఈసారి ఓ అడుగు ముందుకేశాడు ప్రభాస్. ఎప్పట్లా ఖండించి ఊరుకోకుండా.. కాస్త వెరైటీగా సమాధానమిచ్చాడు. “అనుష్క, నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ […]

అనుష్కపై మరోసారి స్పందించిన ప్రభాస్
X

తామిద్దరి మధ్య స్నేహం తప్ప మరేం లేదని ఇప్పటికీ ప్రభాస్, అనుష్క చాలాసార్లు ప్రకటించారు. రీసెంట్ గా సాహో ప్రచారం ప్రారంభించిన ప్రభాస్ కూడా దీనిపై చాలాసార్లు రియాక్ట్ అయ్యాడు.

అనుష్క తనకు స్నేహితురాలు మాత్రమేనని, అంతకుమించి అనుబంధం లేదని తెలిపాడు. కానీ పుకార్లు ఆగకపోవడంతో ఈసారి ఓ అడుగు ముందుకేశాడు ప్రభాస్. ఎప్పట్లా ఖండించి ఊరుకోకుండా.. కాస్త వెరైటీగా సమాధానమిచ్చాడు.

“అనుష్క, నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ షిప్ ఉందని మీరంటే సాక్ష్యం చెప్పండి. ఈ రెండేళ్లలో అనుష్కను నన్ను కలిపి ఏకాంతంగా ఎవరైనా చూశారా? ఏమైనా స్టిల్స్ ఉన్నాయా?… కరణ్ జోహార్ షోలో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అప్పుడు కూడా నేను చెబితే నమ్మరని.. పక్కనే ఉన్న రానా, రాజమౌళితో చెప్పించాను. ఇప్పటికీ ఇంకా మా ఇద్దరి మధ్య ఏదో ఉందని మీరు (మీడియా) నమ్మితే నేను చేసేదేం లేదు.”

ఇలా ఈసారి కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు ప్రభాస్. ఈ హీరో ఎప్పుడూ కూల్ గా ఉంటాడు. కానీ అనుష్క వ్యవహారంపై పదే పదే ప్రశ్నలు రావడంతో ఇలా కాస్త సహనం కోల్పోయాడు. మరోవైపు తన పెళ్లికి సంబంధించి అడిగిన ప్రశ్నల్ని కూడా స్కిప్ చేశాడు ప్రభాస్. అది తన చేతుల్లో లేదన్నాడు.

First Published:  16 Aug 2019 1:19 AM GMT
Next Story