Telugu Global
International

9 ఏళ్ల బాలుడు కిలిమంజారో ఎక్కాడు

తొమ్మిదేళ్ల వయసులో సాధారణం గా పిల్లలు చిన్న ఎత్తు ఎక్కడమంటేనే భయపడతారు. అటువంటిది ప్రపంచం లోనే ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో ని ఎక్కాలంటే ఎంత ధైర్యం, శారీరక సామర్థ్యం ఉండాలో ఆలోచించండి. ఆఫ్రికాలో ఎత్తయిన ఈ పర్వతం ఎత్తు 19, 341 అడుగులు. ఇటీవల భారతదేశానికి చెందిన అద్వైత్ కిలిమంజారో పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నాడు. పూనేకి చెందిన ఈ బాలుడు ఈ ఫీట్ సాధించడానికి మచేం రూట్ ని ఎంచుకున్నాడు. ఈ బుడుతడు ఆరేళ్ల వయసులో 2016 […]

9 ఏళ్ల బాలుడు కిలిమంజారో ఎక్కాడు
X

తొమ్మిదేళ్ల వయసులో సాధారణం గా పిల్లలు చిన్న ఎత్తు ఎక్కడమంటేనే భయపడతారు. అటువంటిది ప్రపంచం లోనే ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో ని ఎక్కాలంటే ఎంత ధైర్యం, శారీరక సామర్థ్యం ఉండాలో ఆలోచించండి.

ఆఫ్రికాలో ఎత్తయిన ఈ పర్వతం ఎత్తు 19, 341 అడుగులు. ఇటీవల భారతదేశానికి చెందిన అద్వైత్ కిలిమంజారో పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నాడు. పూనేకి చెందిన ఈ బాలుడు ఈ ఫీట్ సాధించడానికి మచేం రూట్ ని ఎంచుకున్నాడు.

ఈ బుడుతడు ఆరేళ్ల వయసులో 2016 లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ని ఏడురోజుల్లో అధిరోహించాడు.

“ఈ ట్రెక్ చాలా కష్టమయింది. కాని ఫన్నీ గా కూడా ఉంది. ఎవరెస్ట్ ని ఎక్కేటప్పుడు చెక్క ఇళ్లలో వుండేవాళ్లం. కాని కిలిమంజారో ని ఎక్కేటప్పుడు టెంట్లలో నివసించాం. ఇది మంచి అనుభవం” అంటూ అద్వైత్ తన అనుభవాలను చెప్పుకొచ్చాడు.

ఇంకాస్త తొందరగా ఈ పర్వతాన్ని అధిరోహించేవాడినే… ఆ పర్వత అందాలు నన్ను ముందుకి సాగకుండా ఆపుతూ ఉన్నందు వల్ల కొద్దిగా లేటుగా ఎక్కానని కవితాత్మకం గా చెప్పాడు అద్వైత్.

అద్వైత్ తల్లి పాయల్ భాటియా మాటల ప్రకారం ఇతడు రెండు నెలలు కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. ఈ ట్రెకింగ్ కార్యక్రమాన్ని పూనేలోని ఎడ్వంచర్ పల్స్ అనే సంస్థ నిర్వహించింది.

First Published:  16 Aug 2019 8:53 AM GMT
Next Story