Telugu Global
Cinema & Entertainment

'రణరంగం' సినిమా రివ్యూ

రివ్యూ : రణరంగం రేటింగ్ : 2.5/5 తారాగణం : శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్, మురళి శర్మ, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అజయ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు సంగీతం : ప్రశాంత్ పిళ్ళై నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ దర్శకత్వం : సుధీర్ వర్మ ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో శర్వానంద్ ఈసారి సుధీర్వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల […]

రణరంగం సినిమా రివ్యూ
X

రివ్యూ : రణరంగం
రేటింగ్ : 2.5/5
తారాగణం : శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్, మురళి శర్మ, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అజయ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
సంగీతం : ప్రశాంత్ పిళ్ళై
నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
దర్శకత్వం : సుధీర్ వర్మ

ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో శర్వానంద్ ఈసారి సుధీర్వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాలో శర్వానంద్ ఇంతకుముందు సినిమాలకు భిన్నంగా ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ అవతారంలో కనిపించాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది.

కథ:

దేవా (శర్వానంద్) ఒక బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన సమయంలో లిక్కర్ పై బ్యాన్ విధించారు. ఆ సమయంలో లిక్కర్ బిజినెస్ లోకి దిగుతాడు దేవా. అలా కొన్ని పరిస్థితుల కారణంగా దేవా పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారుతాడు.

గ్యాంగ్ స్టర్ గా మారిన దేవా ఏం చేశాడు? పరిస్థితులను ఎలా చక్క పెడతాడు? చివరికి ఏమైంది? దేవా జీవితంలో (కళ్యాణి ప్రియదర్శన్) మరియు గీత (కాజల్ అగర్వాల్) ల పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

శర్వానంద్ నటన ఈ సినిమాకి ఫ్లస్ ఫాయింట్. గ్యాంగ్ స్టర్ తరహా పాత్ర లో శర్వానంద్ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో శర్వానంద్ నటన సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు.

కాజల్ అగర్వాల్ మరియు కల్యాణీ ప్రియదర్శన్ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ బాగానే నటించారు. ఇద్దరు హీరోయిన్లు శర్వానంద్ తో మంచి కెమిస్ట్రీ ని కూడా మైంటైన్ చేస్తూ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.

మురళి శర్మ తన నటనతో అందినీ మెప్పిస్తాడు. బ్రహ్మాజీ మరియు సుబ్బరాజు నటన కూడా ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. అజయ్ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. ఆదర్శ్ బాలకృష్ణ కూడా తన పాత్రకి బాగా సెట్ అయ్యాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా కోసం ఒక మంచి కథను ఎంపిక చేసుకున్నారు. సగం సినిమా 90ల బ్యాక్ డ్రాప్ తో సాగగా మిగతా సగం ప్రజెంట్ జనరేషన్ లో నడుస్తుంది. అయితే ఈ రెండిటినీ తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడు. శర్వానంద్ చెప్పిన డైలాగులు కొన్న బాగున్నాయి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్ పిళ్ళై ఈ సినిమాకి మంచి సంగీతాన్నే అందించారు. పాటలు మాత్రమే కాకుండా నేపధ్య సంగీతం కూడా సినిమాకి చాలా బాగా సెట్ అయింది. సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి సినిమాకి చాలా మంచి విజువల్స్ ను అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.

బలాలు:

శర్వానంద్, డైలాగులు, నేపధ్య సంగీతం

బలహీనతలు:

సెకండ్ హాఫ్ లో సాగతీత సన్నివేశాలు

చివరి మాట:

ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ తో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారాయి. ఒక బలమైన కథ ఉన్నప్పటికీ కథ నెరేషన్ స్లో గా ఉండడంతో ప్రేక్షకులకు కొంత బోర్ కొడుతుంది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. శర్వానంద్ నటన, డైలాగులు, నేపథ్య సంగీతం ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ సాగతీత సన్నివేశాలతో పాటు శర్వానంద్ రెండు ప్రేమ కథలు అంత ఆసక్తికరంగా లేకపోవడం మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. కొంచెం స్లో నేరేషన్ ని తట్టుకోగలిగే ప్రేక్షకులు ‘రణరంగం’ సినిమా ని హ్యాపీగా చూసేయొచ్చు.

బాటమ్ లైన్:

స్లో గా సాగుతూ పోయే ‘రణరంగం’

First Published:  15 Aug 2019 5:54 AM GMT
Next Story