Telugu Global
NEWS

తెలంగాణలో మరో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట, సూర్యపేట, నల్గొండ జిల్లాలలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. సిద్దిపేట వైద్య కళాశాల ఇప్పటికే పూర్తి స్థాయిలో పని చేస్తుండగా.. సూర్యపేట, నల్గొండలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. […]

తెలంగాణలో మరో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు
X

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చనున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట, సూర్యపేట, నల్గొండ జిల్లాలలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. సిద్దిపేట వైద్య కళాశాల ఇప్పటికే పూర్తి స్థాయిలో పని చేస్తుండగా.. సూర్యపేట, నల్గొండలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ రెండు కళాశాలల్లో బోధన, వైద్య సిబ్బంది నియామకానికి కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఇక ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 400 పడకలు ఉన్నాయి. జానాభా ప్రాతిపదికన కూడా వీటికి వైద్య కళాశాలకు కావల్సిన అర్హతలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. దీంతో దేశవ్యాప్తంగా 75 ప్రభుత్వ ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చే జాబితాలో ప్రస్తుతానికి ఖమ్మం ఆసుపత్రికి చోటు దక్కింది. ఈ ఆసుపత్రికి త్వరలోనే అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పడనుంది.

అంతే కాకుండా కరీంనగర్ ఆసుపత్రిని కూడా వైద్య కళాశాలగా రూపొందించడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

First Published:  12 Aug 2019 6:38 AM GMT
Next Story