Telugu Global
NEWS

అందరి కన్ను హుజూర్ నగర్ ఉప ఎన్నిక పైనే

హుజూర్ నగర్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ సవాల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ కి ఎన్నిక కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. త్వరలోనే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో గట్టి దెబ్బతిన్న టిఆర్ఎస్ ఎట్లైనా గెలవాలని చూస్తోంది. అట్లాగే తెలంగాణలో బలపడాలని […]

అందరి కన్ను హుజూర్ నగర్ ఉప ఎన్నిక పైనే
X

హుజూర్ నగర్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ సవాల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ కి ఎన్నిక కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. త్వరలోనే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానుంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో గట్టి దెబ్బతిన్న టిఆర్ఎస్ ఎట్లైనా గెలవాలని చూస్తోంది. అట్లాగే తెలంగాణలో బలపడాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బిజెపి కూడా ఈ ఉప ఎన్నికను సవాలు గా తీసుకున్నది.

హుజూర్ నగర్ కాంగ్రెస్ కి కంచుకోట. ఇప్పటి వరకు టిఆర్ఎస్ ఆ స్థానాన్ని ఒక్కసారి కూడా గెలుచుకోలేదు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య నాలుగు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం.

అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్ సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రజాభిప్రాయం మారింది. ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోందని, అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో టిఆర్ఎస్ చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ముఖ్యంగా డబ్బులు బాగా ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థులకు మాత్రమే సీటు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. బిజెపి, కాంగ్రెస్ లు ముందు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాతే టిఆర్ఎస్ తన అభ్యర్థిని ఖరారు చేస్తుందని నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

హుజూర్ నగర్ లో తమకు ఓటమి లేదు కాబట్టి ఆ సీటు తమదే అంటున్నారు కాంగ్రెస్ వారు. ప్రభుత్వ వ్యతిరేకత, కాశ్మీర్ లో 370 అధికరణ రద్దు వంటి అంశాల కారణంగా తమకి గెలిచే అవకాశాలు ఉన్నాయని బిజెపి అంటున్నది.

First Published:  11 Aug 2019 4:46 AM GMT
Next Story