Telugu Global
NEWS

టీడీపీపై చర్యలు తీసుకోవాలని పులివెందుల వాసుల డిమాండ్

చంద్రబాబు నుంచి టీడీపీ నేతల వరకు వైసీపీని విమర్శించాలంటే వెంటనే పులివెందుల పంచాయితీలు చేస్తున్నారు… కడప మార్కు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించడం పరిపాటిగా మారింది. సుధీర్ఘకాలం పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబు కూడా ఏపీలో భాగమైన పులివెందులపై సులువుగానే కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత కూడా ఏ కార్యక్రమానికి హాజరైనా సరే ఏపీలో పులివెందుల పంచాయితీలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. చంద్రబాబు స్పూర్తితో టీడీపీ నేతలు కూడా కడప జిల్లా పైనా, పులివెందుల పైనా విమర్శలు […]

టీడీపీపై చర్యలు తీసుకోవాలని పులివెందుల వాసుల డిమాండ్
X

చంద్రబాబు నుంచి టీడీపీ నేతల వరకు వైసీపీని విమర్శించాలంటే వెంటనే పులివెందుల పంచాయితీలు చేస్తున్నారు… కడప మార్కు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించడం పరిపాటిగా మారింది. సుధీర్ఘకాలం పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబు కూడా ఏపీలో భాగమైన పులివెందులపై సులువుగానే కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఎన్నికల తర్వాత కూడా ఏ కార్యక్రమానికి హాజరైనా సరే ఏపీలో పులివెందుల పంచాయితీలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. చంద్రబాబు స్పూర్తితో టీడీపీ నేతలు కూడా కడప జిల్లా పైనా, పులివెందుల పైనా విమర్శలు చేస్తున్నారు. తప్పులు చేస్తే వ్యక్తులు చేస్తారే గానీ, ఆ ప్రాంతానికి, ఆ నేలకు, అక్కడి ప్రజలకు ఏం సంబంధం అన్న భావన కూడా మరిచి టీడీపీ నేతలు ఇలా విమర్శలు చేయడం ఏమిటి? అని పులివెందుల వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌కు చంద్రబాబు మధ్య ఏదైనా ఉంటే వారు వారు చూసుకోవాలి గానీ… పులివెందులలో పుట్టిన వారంతా చెడ్డవారే, కడప జిల్లాలో ప్రజలంతా క్రిమినల్సే అన్నట్టుగా చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రాంతం పేరుతో కించపరుస్తుంటే కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు పౌరుషం రావడం లేదా అని నిలదీస్తున్నారు. జగన్‌ను విమర్శించేందుకు ప్రాంతం పేరును వాడవద్దని ఎందుకు చంద్రబాబుకు సూచించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలపైనా అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాటి అధికార టీడీపీ ఇదే తరహాలో తమ జిల్లాను కించపరుస్తూ మాట్లాడిందని… ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే అవే నిందలు తమకు తప్పడం లేదంటున్నారు. ఒక ప్రాంతాన్ని కించపరుస్తూ టీడీపీ నేతలు మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. కనీసం పులివెందులకు చెందిన న్యాయవాదులు, మేధావులైనా ఈ అంశంపై చొరవ చూపి… కోర్టులను ఆశ్రయించి… కించపరిచే వ్యాఖ్యల నుంచి కడప జిల్లాను కాపాడాల్సిందిగా సామాన్యులు కోరుతున్నారు.

First Published:  10 Aug 2019 12:40 AM GMT
Next Story