Telugu Global
NEWS

కుక్కలను చంపించిన సర్పంచ్‌పై కలెక్టర్ వేటు

గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని గ్రామస్తులు గగ్గోలు పెట్టడంతో నివారణ చర్యలకు ప్రయత్నించి సర్పంచ్ తన పదవిని పోగొట్టుకున్నాడు. నల్లగొండ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చందంపేట మండలం తెల్‌దేవరపల్లిలో దాదాపు 40 వీధి కుక్కులుండేవి. మహిళలు, పిల్లలు ఒంటరిగా వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి. కుక్కలపై అనేక ఫిర్యాదులు రావడంతో సర్పంచ్ పాపానాయక్ … మత్తు మందు సాయంతో వాటిని చంపించేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్వచ్చంధ సంస్థ సభ్యులు హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు […]

కుక్కలను చంపించిన సర్పంచ్‌పై కలెక్టర్ వేటు
X

గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని గ్రామస్తులు గగ్గోలు పెట్టడంతో నివారణ చర్యలకు ప్రయత్నించి సర్పంచ్ తన పదవిని పోగొట్టుకున్నాడు. నల్లగొండ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చందంపేట మండలం తెల్‌దేవరపల్లిలో దాదాపు 40 వీధి కుక్కులుండేవి.

మహిళలు, పిల్లలు ఒంటరిగా వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి. కుక్కలపై అనేక ఫిర్యాదులు రావడంతో సర్పంచ్ పాపానాయక్ … మత్తు మందు సాయంతో వాటిని చంపించేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్వచ్చంధ సంస్థ సభ్యులు హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

కమిషన్ ఆదేశం మేరకు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ … సదరు సర్పంచ్‌ను సస్పెండ్ చేశారు. గ్రామస్తుల మంచి కోసమే తాను ఈ పని చేశానని సర్పంచ్ చెబుతుండగా… జంతు ప్రేమికులు మాత్రం కుక్కలను చంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

First Published:  10 Aug 2019 12:38 AM GMT
Next Story