Telugu Global
NEWS

బిగ్ షాక్... కోడెల షోరూంలు సీజ్

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. నరసరావుపేటలోని కోడెల కుమారుడు శివరాంకు చెందిన గౌతమ్ హోండా షోరూంను అధికారులు సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా ఇంతకాలంగా అక్రమ మార్గంలో వాహనాలను విక్రయిస్తున్నట్టు నిర్ధారణ కావడంలో షోరూంను సీజ్ చేశారు. ఐదేళ్లుగా ఈ దందాను కోడెల కుమారుడు సాగించినట్టు తేలింది. కోడెలకు బినామీగా భావించే యర్రంశెట్టి మోటార్స్‌లో కూడా ఇదే తరహాలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. టాక్స్‌లు చెల్లించకుండా వందలాది వాహనాలను ఈ […]

బిగ్ షాక్... కోడెల షోరూంలు సీజ్
X

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. నరసరావుపేటలోని కోడెల కుమారుడు శివరాంకు చెందిన గౌతమ్ హోండా షోరూంను అధికారులు సీజ్ చేశారు.

పన్నులు చెల్లించకుండా ఇంతకాలంగా అక్రమ మార్గంలో వాహనాలను విక్రయిస్తున్నట్టు నిర్ధారణ కావడంలో షోరూంను సీజ్ చేశారు. ఐదేళ్లుగా ఈ దందాను కోడెల కుమారుడు సాగించినట్టు తేలింది.

కోడెలకు బినామీగా భావించే యర్రంశెట్టి మోటార్స్‌లో కూడా ఇదే తరహాలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. టాక్స్‌లు చెల్లించకుండా వందలాది వాహనాలను ఈ షోరూంల ద్వారా విక్రయించినట్టు తేల్చారు. యర్రంశెట్టి మోటార్స్ షోరూంను కూడా అధికారులు సీజ్ చేశారు.

First Published:  10 Aug 2019 1:19 AM GMT
Next Story