Telugu Global
NEWS

వాస్తవాలు చెప్పడం... అందరినీ ఆకర్షించింది

పెట్టుబడుల సదస్సు డిప్లొమేటిక్ ఔట్ రిచ్ లో ముఖ్యమంత్రి ఎలాంటి బేషజాలకు పోకుండా రాష్ట్ర్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు ఉన్నాయని కాని, పక్క రాష్ట్ర్రాలతో పోలిస్తే తాము ఎన్నో రెట్టు గొప్ప వారిమని కాని చెప్పకుండా వాస్తవాలను మాత్రమే వివరించిన తీరు విదేశీ ప్రతినిధులను మరింత ఆకట్టుకుందని అంటున్నారు. నిజానికి పొరుగు రాష్ట్ర్రాలైన తెలంగాణ, కర్నాటకల కంటే తాము అన్ని […]

వాస్తవాలు చెప్పడం... అందరినీ ఆకర్షించింది
X

పెట్టుబడుల సదస్సు డిప్లొమేటిక్ ఔట్ రిచ్ లో ముఖ్యమంత్రి ఎలాంటి బేషజాలకు పోకుండా రాష్ట్ర్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు ఉన్నాయని కాని, పక్క రాష్ట్ర్రాలతో పోలిస్తే తాము ఎన్నో రెట్టు గొప్ప వారిమని కాని చెప్పకుండా వాస్తవాలను మాత్రమే వివరించిన తీరు విదేశీ ప్రతినిధులను మరింత ఆకట్టుకుందని అంటున్నారు.

నిజానికి పొరుగు రాష్ట్ర్రాలైన తెలంగాణ, కర్నాటకల కంటే తాము అన్ని విధాలుగా వెనుకబడే ఉన్నామని, అయితే పెట్టుబడులు పెడితే అక్కడి కంటే ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని మెరుగైన అవకాశాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మాటలు విన్న విదేశీ ప్రతినిధులు, రాయబారులు ఒకింత ఆశ్చర్యానికి లోనవడంతో పాటు నిజాయితీగా వ్యవహరించిన తీరుపై ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారని అంటున్నారు.

రాష్ట్ర్ర విభజన తర్వాత తమ రాష్ట్ర్రం ఎంత వెనుకబడిపోయిందో వివరించిన ముఖ్యమంత్రి అదే స్ధాయిలో తమకు ఉన్న సహజ వనరులను కూడా విదేశీ ప్రతినిధులకు వివరించారు. ఇది విదేశీ ప్రతినిధులకు భరోసాను కలిగించిందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నిరాడంబరంగా వ్యవహరించడం, అందరితోను స్నేహపూర్వకంగా మెలగడం కూడా సదస్సుకు హాజరైన విదేశీ రాయబారులను ఆకట్టుకుందని అంటున్నారు. నిజానికి భారతదేశంలో రాజకీయ నాయకులు చాలా డిప్లమేటిక్ గా వ్యవహరిస్తారని, బేషజాలకు పోతారనేది విదేశాల్లో ఉన్న పేరు. అయితే అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా నిరాడంబరంగా వ్యవహరించడం, తాను చెబుతున్న పారదర్శకతను తానే ముందుగా పాటించడం విదేశీ ప్రతినిధులు, రాయబారులకు సరికొత్త అనుభవాన్నిఅందించిందని అంటున్నారు.

పెట్టుబడులకు ఆహ్వనించే వారు తామ రాష్ట్ర్రం ఇంద్రలోకమని, తాము దేవేంద్రులమంటూ గతంలో చెప్పే వారని, అయితే నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం వాస్తవాలను వివరిస్తూ “మీరు పరిశ్రమలు పెట్టండి… లాభాలు పొందండి… మాకు ఉద్యోగాల్లోనూ, రాష్ట్ర్ర పగ్రతిలోనూ సహకరించండి ” అని చెప్నారని విదేశీ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  10 Aug 2019 1:02 AM GMT
Next Story