Telugu Global
Cinema & Entertainment

ఎక్స్ క్లూజివ్.... వినాయక్ మూవీకి డేట్ ఫిక్స్

దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా మారిన విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో వినాయక్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని ఆమధ్య దిల్ రాజు స్వయంగా తిరుపతిలో ప్రకటించాడు. ఇప్పుడీ సినిమా ఓపెనింగ్ కు డేట్ సెట్ అయింది. అక్టోబర్ 9న ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది. గతంలో శంకర్ వద్ద పనిచేసిన నరసింహరావు అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దిల్ రాజును నిర్మాతను చేసిన వ్యక్తి వినాయక్. […]

ఎక్స్ క్లూజివ్.... వినాయక్ మూవీకి డేట్ ఫిక్స్
X

దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా మారిన విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో వినాయక్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని ఆమధ్య దిల్ రాజు స్వయంగా తిరుపతిలో ప్రకటించాడు. ఇప్పుడీ సినిమా ఓపెనింగ్ కు డేట్ సెట్ అయింది. అక్టోబర్ 9న ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది. గతంలో శంకర్ వద్ద పనిచేసిన నరసింహరావు అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

దిల్ రాజును నిర్మాతను చేసిన వ్యక్తి వినాయక్. దిల్ అనే సినిమాతోనే నిర్మాతగా మారాడు. అందుకే దిల్ రాజు అయ్యాడు. ఆ సినిమాకు వినాయక్ దర్శకుడు. మళ్లీ ఇన్నేళ్లకు సీన్ రివర్స్ అయింది. ఈసారి వినాయక్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను దిల్ రాజు తీసుకున్నాడు. ఓ మధ్యవయష్కుడి కథతో ఈ సినిమా రాబోతోంది. 40 ఏళ్ల మిడిల్ ఏజ్డ్ వ్యక్తిగా వినాయక్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు.

మరోవైపు వినాయక్ మాత్రం ఈ సినిమాను చాలా లైట్ తీసుకుంటున్నాడు. తను ఫిట్ గా మారాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని, కానీ కుదరడం లేదని.. ఈ సినిమాతోనైనా ఫిట్ గా మారొచ్చనే ఉద్దేశంతో ఒప్పుకున్నానని అంటున్నాడు. రాక్షసుడు సినిమాకు ప్రచారం కల్పించేందుకు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటుచేశాడు వినాయక్. ఈ ప్రెస్ మీట్ లో కాస్త సన్నబడిన వినాయక్ కనిపించాడు.

First Published:  8 Aug 2019 6:02 PM GMT
Next Story