మహిళా స్టార్ల సంపాదనలో సెరెనా టాప్
ఏడాదికి 29.2 మిలియన్ డాలర్ల సంపాదన మొదటి 15 మంది మహిళాస్టార్లలో సింధు క్రీడారంగంలో అత్యంత సంపాదన పరులైన మహిళా స్టార్ల జాబితాలో..అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. 2018 జూన్ 1 నుంచి 2019 జూన్ 1 మధ్య..మొత్తం 12 మాసాల కాలంలో..మ్యాచ్ ఫీజు, ప్రైజ్ మనీ, ఎండార్స్ మెంట్లు, బోనస్, జీతాలు, గ్యారెంటీమనీ రూపంలో అందుకొన్నమొత్తాలను పరిగణనలోకి తీసుకొని మరీ పోర్భ్స్ సంస్థ సంపాదనను లెక్కించింది. సెరెనా ఏడాది కాలంలో […]
- ఏడాదికి 29.2 మిలియన్ డాలర్ల సంపాదన
- మొదటి 15 మంది మహిళాస్టార్లలో సింధు
క్రీడారంగంలో అత్యంత సంపాదన పరులైన మహిళా స్టార్ల జాబితాలో..అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది.
2018 జూన్ 1 నుంచి 2019 జూన్ 1 మధ్య..మొత్తం 12 మాసాల కాలంలో..మ్యాచ్ ఫీజు, ప్రైజ్ మనీ, ఎండార్స్ మెంట్లు, బోనస్, జీతాలు, గ్యారెంటీమనీ రూపంలో అందుకొన్నమొత్తాలను పరిగణనలోకి తీసుకొని మరీ పోర్భ్స్ సంస్థ సంపాదనను లెక్కించింది.
సెరెనా ఏడాది కాలంలో 29.2 మిలియన్ డాలర్ల ఆర్జనతో … క్రీడల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న మహిళగా రికార్డుల్లో చేరింది.
అంతేకాదు.. మహిళా టెన్నిస్ చరిత్రలో వరుసగా నాలుగు సంవత్సరాల పాటు అత్యధిక ఆర్జన కలిగిన మహిళగా చరిత్ర సృష్టించింది. సెరెనా సంపాదనలో ప్రైజ్ మనీ ద్వారా వచ్చిన మొత్తం కేవలం 4.2 మిలియన్ డాలర్లు మాత్రమే.
నయోమీ ఒసాకా 20 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండోస్థానంలో నిలిచింది.
నాలుగో మహిళ ఒసాకా….
మహిళా ప్రో టెన్నిస్ చరిత్రలో 20 మిలియన్ డాలర్లు ఆర్జించిన నాలుగో మహిళగా ఒసాకా నిలిచింది. గతంలోనే సెరెనా, మారియా షరపోవా, లీ నా ఏడాదికాలంలో 20 మిలియన్ డాలర్లు ఆర్జించిన మహిళా టెన్నిస్ స్టార్లుగా ఉన్నారు.
అత్యధిక సంపాదన కలిగిన మొదటి 15 మంది మహిళా అథ్లెట్లలో భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు సైతం చోటు సంపాదించడం విశేషం.
థాయ్ గోల్ఫర్ ఆర్యజుటాను గార్న్ సైతం టాప్ -15లో నిలిచింది.
వింబుల్డన్ మాజీ చాంపియన్ ఏంజెలికో కెర్బర్ 11.8 మిలియన్ డాలర్లతో మూడు, సిమోనా హాలెప్ నాలుగు స్థానాలలో నిలిచారు.