Telugu Global
NEWS

క్రికెట్ దిగ్గజాల బాటలో తనయులు

విజ్జీ ట్రోఫీకి ముంబై జట్టులో అర్జున్ టెండుల్కర్  అండర్ -14 క్రికెట్లో సమిత్ ద్రావిడ్ షో భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్ తనయులు.. అర్జున్, సమిత్.. తమ తండ్రుల బాటలోనే నడవటానికే తహతహ లాడుతున్నారు. అండర్ -19 విభాగంలో అర్జున్ టెండుల్కర్, అండర్ -14 విభాగంలో సమిత్ ద్రావిడ్ నిలకడగా రాణిస్తూ అందరి దృష్టీ ఆకట్టుకొంటున్నారు. ముంబై టీ-20 లీగ్ లో ఆకాశ్ టైగర్స్ జట్టు తరపున ఆడిన అర్జున్ ఆరుమ్యాచ్ […]

క్రికెట్ దిగ్గజాల బాటలో తనయులు
X
  • విజ్జీ ట్రోఫీకి ముంబై జట్టులో అర్జున్ టెండుల్కర్
  • అండర్ -14 క్రికెట్లో సమిత్ ద్రావిడ్ షో

భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్ తనయులు.. అర్జున్, సమిత్.. తమ తండ్రుల బాటలోనే నడవటానికే తహతహ లాడుతున్నారు.

అండర్ -19 విభాగంలో అర్జున్ టెండుల్కర్, అండర్ -14 విభాగంలో సమిత్ ద్రావిడ్ నిలకడగా రాణిస్తూ అందరి దృష్టీ ఆకట్టుకొంటున్నారు.

ముంబై టీ-20 లీగ్ లో ఆకాశ్ టైగర్స్ జట్టు తరపున ఆడిన అర్జున్ ఆరుమ్యాచ్ లు ఆడి 104 పరుగులు సాధించడంతో పాటు.. బౌలర్ గా 5 వికెట్లు పడగొట్టి ఆల్ రౌండర్ గా తానేమిటో నిరూపించుకొన్నాడు.

ముంబై జట్టులో అర్జున్ టెండుల్కర్…

సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్… సబ్ జూనియర్ స్థాయి నుంచే అత్యుత్తమ శిక్షణ పొందడం ద్వారా రాటుదేలుతున్నాడు. ఎడమచేతి వాటం పేస్ ఆల్ రౌండర్ గా ఎదుగుతున్నాడు అర్జున్.

అండర్ -19 క్రికెట్లో భారతజట్టు సభ్యుడుగా శ్రీలంకతో జరిగిన సిరీస్ లో పాల్గొన్న అర్జున్ తన కెరియర్ లో తొలి అంతర్జాతీయ వికెట్ సైతం పడగొట్టాడు.

ఇంగ్లండ్ లో అర్జున్ శిక్షణ…

అర్జున్ టెండుల్కర్.. ఇంగ్లండ్ లో శిక్షణ పొందుతూ ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ లో భారతజట్టుకు నెట్ బౌలర్ గా సేవలు అందించాడు.

2019 విజ్జీ ట్రోఫీలో పాల్గొనే ముంబై జట్టులో తొలిసారిగా అర్జున్ చోటు సంపాదించాడు. ఆగస్టు 22 నుంచి ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగే ఈ టోర్నీలో అర్జున్ తన సత్తా చాటుకోడానికి సిద్ధమయ్యాడు.

ద్రావిడ్ బాటలో సమిత్….


ఇండియన్ క్రికెట్ వాల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ సైతం…. పిట్టకొంచెం కూతఘనం అనిపించుకొంటున్నాడు. బెంగళూరులోని మాల్యా ఆదితి ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్న సమిత్ ద్రావిడ్ ..అండర్ -14 క్రికెట్ టోర్నీలలో తన స్కూలు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

కర్నాటక క్రికెట్ సంఘం నిర్వహించే బీటీఆర్ కప్ అండర్ -14 టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో..స మిత్ 150 పరుగుల స్కోరు సాధించడం ద్వారా తనజట్టుకు 412 పరుగుల విజయం అందించాడు.

సమిత్ ఆటతీరు, వయసును మించి పరిణతి చూపడాన్ని చూసి..తండ్రికి తగ్గ తనయుడిగా క్రికెట్ పండితులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం బెంగళూరులోని భారత క్రికెట్ అకాడమీ చైర్మన్ గా సేవలు అందిస్తున్న ద్రావిడ్ తనయుడు సమిత్ ఏనాటికైనా భారత క్రికెట్ కు సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First Published:  8 Aug 2019 1:21 AM GMT
Next Story