Telugu Global
International

కశ్మీర్ ప్రగతే మా ముందున్న లక్ష్యం

జమ్మూ – కశ్మీర్ ను అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో నిలపడమే తమ ముందున్న లక్ష్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. “ఏడు దశాబ్దాలుగా కశ్మీర్ అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉంది. మేం ఇప్పుడు సరికొత్త కశ్మీర్ ను తీసుకువస్తాం” అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో పాటు శాసనసభ ఏర్పాటు, కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటుపై పార్లమెంట్ ఉభయ సభలలోనూ తీర్మానాలను ఆమోదించిన తర్వాత తొలిసారిగా జమ్మూ […]

కశ్మీర్ ప్రగతే మా ముందున్న లక్ష్యం
X

జమ్మూ – కశ్మీర్ ను అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో నిలపడమే తమ ముందున్న లక్ష్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

“ఏడు దశాబ్దాలుగా కశ్మీర్ అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉంది. మేం ఇప్పుడు సరికొత్త కశ్మీర్ ను తీసుకువస్తాం” అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో పాటు శాసనసభ ఏర్పాటు, కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటుపై పార్లమెంట్ ఉభయ సభలలోనూ తీర్మానాలను ఆమోదించిన తర్వాత తొలిసారిగా జమ్మూ – కశ్మీర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఇన్నాళ్లూ ఆర్టికల్ 370 ని ప్రతి ఒక్కరూ తమ స్వార్ధానికి వాడుకున్నారని, ఇక ముందు అలాంటి పరిస్థితులు ఉండవని ఆయన చెప్నారు.

“పాకిస్తాన్ కూడా ఆర్టికల్ 370ని తమకు అనుకూలంగా వాడుకుంది. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా గత ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోలేదు. ఆ తప్పులను మేం సవరించాం” అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370, 37 ఎ వల్ల జమ్మూ – కశ్మీర్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రకటించిన ప్రధాని… తాము తీసుకున్న రద్దు నిర్ణయంతో కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందాయన్నారు. కశ్మీర్ కు రానున్న రోజుల్లో సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని, అక్కడ ఇన్నాళ్లూ పగ్రతికి అడ్డుకట్ట పడిందని, ఇక ముందు అలాంటిదేమీ ఉండదని అన్నారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదాల నుంచి నేడు కశ్మీర్ కు పూర్తి స్వేచ్ఛ కలిగిందని ప్రధాని అన్నారు.

జమ్మూ – కశ్మీర్ లో త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని, ఇక్కడి నుంచి సరికొత్త నాయకత్వం వస్తుందని నరేంద్ర మోదీ ప్రకటించారు. నూతన రైల్వే లైన్లు వస్తాయని, సరికొత్త విమానాశ్రయాలు ఏర్పాటు అవుతాయని, పర్యాటకంగా గతంలో ఎంతో వైభవాన్ని సంతరించుకున్న జమ్మూ – కశ్మీర్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అన్నారు.

” జమ్మూ – కశ్మీర్ యువ నాయకత్వం వస్తుంది. ఇప్పటి వరకూ కేవలం విధాన సభకు మాత్రమే నాయకులు వచ్చారు. ఇక నుంచి గ్రామీణ స్ధాయి నుంచి శాసనసభతో పాటు స్ధానిక సంస్థల్లో కూడా సరికొత్త యువ నాయకత్వం వస్తుంది” అని ప్రధాని ప్రకటించారు.

అలాగే జమ్మూ – కశ్మీర్ లో విద్యాసంస్థలు ఏర్పాటు కావడమే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్ధులు జమ్మూ – కశ్మీర్ వెళ్లి విద్యనభ్యసిస్తారని ప్రధాని చెప్పారు.

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బీ.ఆర్.అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం కన్న కలలు ఇన్నాళ్లకు నిజమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ – కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిగించి ఒకే దేశం, ఒకే రాజ్యాంగాన్ని తీసుకువచ్చామని నరేంద్ర మోదీ ప్రకటించారు.

First Published:  8 Aug 2019 10:53 AM GMT
Next Story