Telugu Global
International

రాయబారి బహిష్కరణ...

ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ రుసరుసలాడుతోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ భారత్‌తో వ్యాపార సంబంధాలను తెంచుకునేందుకు సిద్ధమైంది. భారత్ చర్యకు ఏదో విధంగా నిరసన తెలపాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్‌లోని భారత్ రాయబారిని ఆ దేశం బహిష్కరించింది. భారత్‌లోని తన రాయబారిని వెనక్కు పిలిపించుకుంది. కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో పాక్ జాతీయ భద్రతా కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఈ సమావేశంలో భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ […]

రాయబారి బహిష్కరణ...
X

ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ రుసరుసలాడుతోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ భారత్‌తో వ్యాపార సంబంధాలను తెంచుకునేందుకు సిద్ధమైంది.

భారత్ చర్యకు ఏదో విధంగా నిరసన తెలపాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్‌లోని భారత్ రాయబారిని ఆ దేశం బహిష్కరించింది. భారత్‌లోని తన రాయబారిని వెనక్కు పిలిపించుకుంది.

కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో పాక్ జాతీయ భద్రతా కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఈ సమావేశంలో భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షత సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో భారత్ నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఆగస్ట్ 14న కశ్మీరీలకు మద్దతుగా సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15న బ్లాక్‌ డేగా నిర్వహించాలని పాక్ నిర్ణయించుకుంది.

సెప్టెంబర్‌ 5 వరకు పాక్‌ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్టు వెల్లడించింది. కశ్మీర్‌ పరిస్థితులపై చైనాతోనూ చర్చిస్తున్నట్టు పాక్ ప్రకటించింది.

First Published:  7 Aug 2019 8:42 PM GMT
Next Story