Telugu Global
NEWS

జయప్రకాశ్ నారాయణకు ఏం తెలుసు? మేడిగడ్డ గురించి విన్నాడా? కాళేశ్వరం చూశాడా?

తెలంగాణలో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనిపెట్టామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత ధర్మపురిలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్‌ ..తెలంగాణ విధానాలను పరిశీలించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారన్నారు. మిషన్ భగీరథ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నారు. కాళేశ్వరంపై కొందరు స్వయం ప్రకటిత మేధావులు లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వాల తరహాలో నిర్మించి ఉంటే 20 ఏళ్లకు కూడా పూర్తి అయి […]

జయప్రకాశ్ నారాయణకు ఏం తెలుసు? మేడిగడ్డ గురించి విన్నాడా? కాళేశ్వరం చూశాడా?
X

తెలంగాణలో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనిపెట్టామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత ధర్మపురిలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్‌ ..తెలంగాణ విధానాలను పరిశీలించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారన్నారు. మిషన్ భగీరథ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నారు. కాళేశ్వరంపై కొందరు స్వయం ప్రకటిత మేధావులు లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వాల తరహాలో నిర్మించి ఉంటే 20 ఏళ్లకు కూడా పూర్తి అయి ఉండేది కాదన్నారు. ప్రస్తుతం తెలంగాణకు శాశ్వతంగా నీటి సమస్య తీరిపోయిందన్నారు. 44 ఏళ్ల నీటి లభ్యతను ఆధారంగా తీసుకుని ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశామన్నారు. కొందరు ప్రాజెక్టుపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏటా 400 టీఎంసీల నీరు అందుతుందన్నారు. 45 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. జూన్ నుంచి నవంబర్‌ మధ్యనే నెలకు 60 టీఎంసీల చొప్పున ఎత్తిపోస్తామన్నారు. దీని ద్వారా పాత ప్రాజెక్టులకు కూడా నీటిని అందిస్తామన్నారు. త్వరలోనే తెలంగాణ స్వప్నం నిజం కాబోతోందన్నారు. తెలంగాణకు నీరు అందించాలంటే గోదావరి ఒక్కటే మార్గమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును రివర్సబుల్‌ పంపింగ్ అంటూ కొందరు తెలిసి తెలియక రాస్తున్నారని… అది రివర్సబుల్ పంపింగ్ కాదని… లిఫ్ట్ ఇరిగేషన్ అని వివరించారు. కొందరు సన్నాసులు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి కరెంట్ బిల్లు 4992 కోట్లు మాత్రమే అవుతుందన్నారు. కాబట్టి కరెంట్‌ బిల్లులపై తెలివితక్కువ విమర్శలు చేయవద్దని సూచించారు. కాళేశ్వరం ద్వారా 400 టీఎంసీలు, దుమ్ముగూడెం ద్వారా 100 టీఎంసీలు, దేవాదుల ద్వారా 75 టీఎంసీల నీటిని ఏటా అందిస్తామన్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఈ ప్రాజెక్టులను నిర్మించామన్నారు.

ఈ ప్రాజెక్టుపై జయప్రకాశ్ నారాయణ వ్యక్తం చేసిన అభిప్రాయాలను విలేకరులు కేసీఆర్ దృష్టికి తీసుకురాగా…. ఎవరయ్యా ఆయన…. ఆయనకు ఏం తెలుసని మాట్లాడుతాడు? ఆయనకు మేడిగడ్డ తెలుసా? కాళేశ్వరం చూశాడా? ఏమీ తెలియకుండానే స్వయం ప్రకటిత మేథావి లాగా మాట్లాడుతూ ఉండే ఆయనను కూడా పట్టించుకోవాలా? అన్నారు కేసీఆర్ వ్యంగ్యంగా..! తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన మాటలకు మనం విలువ ఇవ్వాలంటారా? అని విలేకరులను ప్రశ్నించారు కేసీఆర్.

First Published:  6 Aug 2019 6:56 AM GMT
Next Story