Telugu Global
Cinema & Entertainment

'రణరంగం' ట్రైలర్ రివ్యూ

ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ మరియు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో శర్వానంద్ ఒక పవర్ […]

రణరంగం ట్రైలర్ రివ్యూ
X

ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ మరియు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో శర్వానంద్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. సినిమా కొంత భాగం 80స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది…. మిగతాది ప్రెసెంట్ లో జరుగుతుంది అని తెలుస్తోంది.

రెండు బ్యాక్ డ్రాప్స్ లోనూ శర్వా గాంగ్ స్టర్ లాగానే కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కూడా కనిపించబోతున్నాడు.

శర్వానంద్ పర్ఫార్మెన్స్ మరియు హీరోయిన్లతో కెమిస్ట్రీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచే విధంగా ఉంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంతి పిళ్ళై సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తారీఖు న విడుదల కాబోతోంది.

First Published:  4 Aug 2019 11:54 PM GMT
Next Story