Telugu Global
Cinema & Entertainment

రూల్స్ బ్రేక్ చేశాడు.... రాజమౌళికి కోపం తెప్పించాడు!

‘మగధీర’ సినిమా షూటింగ్ తర్వాత నుంచి దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్ మంచి స్నేహితులుగా మారిపోయారు. ‘మగధీర’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మళ్లీ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ చేసిన పని వల్ల రాజమౌళి కోపంగా ఉన్నాడట. […]

రూల్స్  బ్రేక్ చేశాడు.... రాజమౌళికి కోపం తెప్పించాడు!
X

‘మగధీర’ సినిమా షూటింగ్ తర్వాత నుంచి దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్ మంచి స్నేహితులుగా మారిపోయారు. ‘మగధీర’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మళ్లీ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ చేసిన పని వల్ల రాజమౌళి కోపంగా ఉన్నాడట. దానికి కారణం రామ్ చరణ్ మీడియా ముందుకు రావటం అని కొందరు అంటారు. తన సినిమా ఏదైనా సినిమాలో హీరో హీరోయిన్ల లుక్స్ బయటికి రాకుండా ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు రాజమౌళి.

పైగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లుక్స్ బయటకు రాకుండా షూటింగ్ లొకేషన్ లో సైతం సెక్యూరిటీని పెంచాడు రాజమౌళి.

కానీ రామ్ చరణ్ ఈ మధ్యనే కీయార అద్వానీ పుట్టినరోజు వేడుకకు వెళ్లి మీడియాకి చిక్కాడు. దీంతో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ లుక్ బయటకు వచ్చేసింది.

నిజానికి రామ్ చరణ్ కేవలం ‘కబీర్ సింగ్’ తో హిట్ అందుకున్న కీయార కి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లి త్వరగానే వచ్చేసాడు. కానీ ఈలోపే మీడియా వాళ్లు కెమెరాలు క్లిక్ మనిపించారు.

ఈ కారణంగానే రాజమౌళి….రామ్ చరణ్ పై అసహనంగా ఉన్నాడని చెబుతున్నారు.

First Published:  4 Aug 2019 10:54 PM GMT
Next Story