Telugu Global
National

చైనాపై దాడి చేసే ధైర్యం ఉందా?

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై కాంగ్రెస్ ఎంపీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో బిల్లుపై మాట్లాడిన ఆజాద్… అమిత్ షా రాజ్యసభలో అణుబాంబు వేశారన్నారు. మోడీ సర్కార్‌కు ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నించారు. మోడీ నిర్ణయంతో దేశ చిత్రపటం ఏమైనా మారిపోయిందా అని ఆజాద్ వ్యాఖ్యానించారు. వారం రోజులుగా కేంద్రం కావాలనే కశ్మీర్‌లో ఉద్రిక్తతలను రేపిందన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కొద్దిభాగం చైనా చేతిలోనూ ఉందన్నారు. చైనాపై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకునే […]

చైనాపై దాడి చేసే ధైర్యం ఉందా?
X

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై కాంగ్రెస్ ఎంపీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో బిల్లుపై మాట్లాడిన ఆజాద్… అమిత్ షా రాజ్యసభలో అణుబాంబు వేశారన్నారు. మోడీ సర్కార్‌కు ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నించారు.

మోడీ నిర్ణయంతో దేశ చిత్రపటం ఏమైనా మారిపోయిందా అని ఆజాద్ వ్యాఖ్యానించారు. వారం రోజులుగా కేంద్రం కావాలనే కశ్మీర్‌లో ఉద్రిక్తతలను రేపిందన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కొద్దిభాగం చైనా చేతిలోనూ ఉందన్నారు.

చైనాపై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకునే ధైర్యం ఉందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కశ్మీర్‌ను విభజించడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదన్నారు. లడఖ్‌ ప్రజలు మరింత కష్టాల పాలవుతారన్నారు.

ఇలాంటి ముఖ్యమైన బిల్లును ఒక్కరోజులోనే సభలో ప్రవేశపెట్టి అదే రోజు ఆమోదించడం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. పాకిస్థాన్‌పై కోపాన్ని కశ్మీరీలపై చూపడం సరికాదన్నారు.

కశ్మీర్ ప్రజలు ఎన్నడూ కూడా పాకిస్థాన్‌ను తమ మాతృదేశంగా భావించలేదన్నారు. కశ్మీర్‌ను ఇలా ముక్కలు చేస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు.

భూతల స్వర్గాన్ని నాశనం చేశారు. కశ్మీర్‌ ప్రజల అనుబంధాన్ని అన్యాయంగా విభజించారని ఆజాద్ విమర్శించారు. కశ్మీర్ చరిత్ర బీజేపీ నేతలకు తెలియదని అందుకే ఇలా చేశారన్నారు.

లడఖ్‌లో బౌద్దులు, షియా ముస్లింలు ఉన్నారని వారి మధ్య ఇప్పుడు చిచ్చుపెట్టారన్నారు. అధికారం కోసం రెండు వర్గాలు గొడవలు పడే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం సృష్టించిందన్నారు.

First Published:  5 Aug 2019 5:15 AM GMT
Next Story