Telugu Global
National

ఆర్టికల్ 370 రద్దు.... రాజ్యసభలో ప్రతిపాదన

జమ్ముకశ్మీర్‌ అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్‌లోని పరిస్థితిపై ప్రకటన చేసిన హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుకు ప్రతిపాదన చేశారు. కశ్మీర్ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో అమిత్ షా ఈ ప్రతిపాదన చేశారు. దాంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా సభలో ఆందోళనకు దిగారు. విపక్షాల నిరసన మధ్య జమ్ముకశ్మీర్‌లో ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును సిద్ధం చేశారు. కశ్మీర్‌లో యుద్దవాతావరణాన్ని సృష్టించారని… మాజీ ముఖ్యమంత్రులను హౌజ్ అరెస్ట్ చేశారని […]

ఆర్టికల్ 370 రద్దు.... రాజ్యసభలో ప్రతిపాదన
X

జమ్ముకశ్మీర్‌ అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్‌లోని పరిస్థితిపై ప్రకటన చేసిన హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుకు ప్రతిపాదన చేశారు.

కశ్మీర్ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో అమిత్ షా ఈ ప్రతిపాదన చేశారు. దాంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా సభలో ఆందోళనకు దిగారు. విపక్షాల నిరసన మధ్య జమ్ముకశ్మీర్‌లో ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును సిద్ధం చేశారు.

కశ్మీర్‌లో యుద్దవాతావరణాన్ని సృష్టించారని… మాజీ ముఖ్యమంత్రులను హౌజ్ అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన అమిత్ షా విపక్షాల అనుమానాలన్నింటినీ తీరుస్తామని ప్రకటించారు.

First Published:  5 Aug 2019 12:27 AM GMT
Next Story