Telugu Global
Cinema & Entertainment

రాక్షసుడు లీక్.... బెల్లంకొండ ఆశలు ఆవిరి

ఎన్నో యాక్షన్ సినిమాలు చేశాడు కలిసిరాలేదు. సీత లాంటి ప్రయోగాలు కూడా చేశాడు. సక్సెస్ రాలేదు. చివరాఖరికి రాక్షసుడు లాంటి రీమేక్ చేశాడు. ఇది కలిసొచ్చింది. సినిమా హిట్ అయింది. దీంతో హిట్ కొట్టాలనే బెల్లంకొండ ఆశ తీరింది. అయితే అంతా బాగానే ఉంది కానీ 2 విషయాల్లో మాత్రం బెల్లంకొండకు నిరాశ తప్పలేదు. వీటిలో ఒకటి హిందీ డబ్బింగ్ రైట్స్. బెల్లంకొండ సినిమాలు ఎలా ఉన్నప్పటికీ, అవి ఫ్లాప్ అయినప్పటికీ హిందీ డబ్బింగ్ లో మాత్రం […]

రాక్షసుడు లీక్.... బెల్లంకొండ ఆశలు ఆవిరి
X

ఎన్నో యాక్షన్ సినిమాలు చేశాడు కలిసిరాలేదు. సీత లాంటి ప్రయోగాలు కూడా చేశాడు. సక్సెస్ రాలేదు. చివరాఖరికి రాక్షసుడు లాంటి రీమేక్ చేశాడు. ఇది కలిసొచ్చింది. సినిమా హిట్ అయింది. దీంతో హిట్ కొట్టాలనే బెల్లంకొండ ఆశ తీరింది. అయితే అంతా బాగానే ఉంది కానీ 2 విషయాల్లో మాత్రం బెల్లంకొండకు నిరాశ తప్పలేదు.

వీటిలో ఒకటి హిందీ డబ్బింగ్ రైట్స్. బెల్లంకొండ సినిమాలు ఎలా ఉన్నప్పటికీ, అవి ఫ్లాప్ అయినప్పటికీ హిందీ డబ్బింగ్ లో మాత్రం సూపర్ హిట్ అవుతాయి. ఎందుకంటే అతడి సినిమాల్లో యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. అందుకే హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోతాయి. అదే భ్రమలో రాక్షసుడు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా కొనుక్కున్నాడు ఓ నిర్మాత. కట్ చేస్తే థ్రిల్లర్ అంశాలు తప్ప యాక్షన్ ఎలిమెంట్స్ లేవు. దీంతో అతడు పంచాయితీ పెట్టినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో బెల్లంకొండ మార్కెట్ ను దెబ్బతీసే పరిణామం ఇది.

ఓవైపు ఇది నడుస్తుండగా మరోవైపు రాక్షసుడు సినిమా పైరసీకి గురైంది. శుక్రవారం సినిమా రిలీజైతే, అదే రోజు సాయంత్రానికి సోషల్ మీడియాలో ఫుల్ సినిమా లీక్ అయింది. దీంతో బెల్లంకొండకు మరిన్ని చిక్కులు తప్పలేదు. రీసెంట్ గా అతడి మార్కెట్ పడిపోవడంతో, మొదటి రోజు షేర్ అటుఇటుగా 2 కోట్ల రూపాయలకే పరిమితమైంది. సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి శని, ఆదివారాలు వసూళ్లు ఊపందుకుంటాయని భావించాడు బెల్లంకొండ. కానీ ఈ పైరసీ ఇప్పుడు అతడి ఆశల్ని ఆవిరి చేసింది.

ఓ వైపు డబ్బింగ్ రైట్స్, మరోవైపు పైరసీ.. ఈ రెండు అంశాలు ఇప్పుడు బెల్లంకొండకు టెన్షన్ తెప్పిస్తున్నాయి. హిట్ కొట్టాననే ఆనందాన్ని అతడికి లేకుండా చేస్తున్నాయి.

First Published:  3 Aug 2019 8:30 PM GMT
Next Story