Telugu Global
NEWS

ప్రపంచ రికార్డు వేదికలో టీ-20 డబుల్ ధమాకా

లాడర్ హిల్ వేదికగా రాత్రి 8 గంటల నుంచి భారత్-విండీస్ తొలిసమరం మూడేళ్ల క్రితమే అమెరికా గడ్డపై భారత్ తొలి టీ-20 షో ధూమ్ ధామ్ టీ-20 లో 5వర్యాంకర్ భారత్..మూడేళ్ల విరామం తర్వాత అమెరికాగడ్డపై తొలిసమరానికి సిద్ధమవుతోంది. భారత సంతతి క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉండే ఫ్లారిడాలోని లాడర్ హిల్ వేదికగా విండీస్ తో తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి తొలి టీ-20 […]

ప్రపంచ రికార్డు వేదికలో టీ-20 డబుల్ ధమాకా
X
  • లాడర్ హిల్ వేదికగా రాత్రి 8 గంటల నుంచి భారత్-విండీస్ తొలిసమరం
  • మూడేళ్ల క్రితమే అమెరికా గడ్డపై భారత్ తొలి టీ-20 షో

ధూమ్ ధామ్ టీ-20 లో 5వర్యాంకర్ భారత్..మూడేళ్ల విరామం తర్వాత అమెరికాగడ్డపై తొలిసమరానికి సిద్ధమవుతోంది. భారత సంతతి క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉండే ఫ్లారిడాలోని లాడర్ హిల్ వేదికగా విండీస్ తో తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ఆడనుంది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి తొలి టీ-20 సమరం ప్రారంభమవుతుంది.

పరుగుల గని లాడెర్ హిల్…

టీ-20 చరిత్రలోనే ప్రపంచ రికార్డు స్కోరు నమోదైన వేదికగా లాడర్ హిల్ స్టేడియానికి పేరుంది. మూడేళ్ల క్రితం ఇదే వేదికగా భారత్- విండీస్ జట్ల మధ్య జరిగిన టీ-20 మ్యాచ్ లో…రెండు ఇన్నింగ్స్ లో కలసి 489 పరుగుల స్కోరు నమోదయ్యింది. 2016 ఆగస్టు 27న జరిగిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ లో విండీస్ ఒక్క పరుగుతో భారత్ పై విజేతగా నిలిచింది.

మూడేళ్ల తర్వాత…

2016 తర్వాత…మూడేళ్ల విరామంలో మరోసారి లాడెర్ హిల్ వేదికగానే 5వ ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ విండీస్ ఢీ కొనబోతున్నాయి.

తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ లను లాడెర్ హిల్ వేదికగానే నిర్వహిస్తున్నారు. అమెరికన్ మార్కెట్లో పాగా వేయటం కోసం..ఐసీసీ.. అప్పుడప్పుడూ అమెరికన్ గడ్డపై టీ-20 మ్యాచ్ లు నిర్వహిస్తూ వస్తోంది.

ఫిఫ్టీ-ఫీఫ్టీ రికార్డు….

టీ-20 ఫార్మాట్లో మాజీ చాంపియన్ భారత్, ప్రస్తుత చాంపియన్ విండీస్ జట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే…రెండుజట్లూ ఫిఫ్టీ-ఫిఫ్టీ విజయాల రికార్డులతో సమఉజ్జీలుగా ఉన్నాయి. చెరో 5 మ్యాచ్ లూ నెగ్గి 5-5 రికార్డుతో నిలిచాయి.

అయితే…ఈ రెండుజట్లు తలపడిన గత ఐదు టీ-20 మ్యాచ్ ల్లో భారత్ 3-1 విజయాల రికార్డుతో ఉంది.

2018 సీజన్లో భాగంగా కోల్ కతా వేదికగా జరిగిన తొలి టీ-20 సమరంలో 5 వికెట్లు, లక్నో వేదికగా ముగిసిన రెండోమ్యాచ్ లో 71 పరుగుల విజయాలు సాధించిన భారత్…చెన్నై వేదికగా జరిగిన మూడో టీ-20 మ్యాచ్ లో 6 వికెట్ల విజయంతో విజయాల హ్యాట్రిక్ పూర్తి చేసింది.

ఇవిన్ లూయిస్ అరుదైన రికార్డు…

విండీస్ ఓపెనర్ ఇవిన్ లూయిస్ కు భారత్ ప్రత్యర్థిగా రెండు టీ-20 సెంచరీలు బాదిన అరుదైన రికార్డే ఉంది. 2016లో లాడెర్ హిల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలిశతకం బాదిన లూయిస్..2017లో కింగ్స్ టన్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో 125 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

2021 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న ఈ తీన్మార్ సిరీస్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా? లేక విశ్వవిజేత కరీబియన్ టీమ్ చెలరేగిపోతుందా ?…తెలుసుకోవాలంటే మాత్రం కొద్దిరోజులపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

First Published:  3 Aug 2019 5:00 AM GMT
Next Story