Telugu Global
Cinema & Entertainment

మొదటిసారి మీడియా ముందుకొచ్చిన రామ్

ఇస్మార్ట్ శంకర్ రిలీజై 2 వారాలు దాటింది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 75 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రామ్ ఎక్కడా కనిపించలేదు. రిలీజ్ కు 2 రోజుల ముందే అమెరికా చెక్కేసిన రామ్, ఇన్నాళ్లకు బయటకొచ్చాడు. సినిమా హిట్ అవ్వడంతో మీడియాతో చిన్న భేటీ కార్యక్రమం ఏర్పాటుచేశాడు. సాధారణంగా తను ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పిన రామ్, ఇస్మార్ట్ శంకర్ […]

మొదటిసారి మీడియా ముందుకొచ్చిన రామ్
X

ఇస్మార్ట్ శంకర్ రిలీజై 2 వారాలు దాటింది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 75 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రామ్ ఎక్కడా కనిపించలేదు. రిలీజ్ కు 2 రోజుల ముందే అమెరికా చెక్కేసిన రామ్, ఇన్నాళ్లకు బయటకొచ్చాడు. సినిమా హిట్ అవ్వడంతో మీడియాతో చిన్న భేటీ కార్యక్రమం ఏర్పాటుచేశాడు.

సాధారణంగా తను ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పిన రామ్, ఇస్మార్ట్ శంకర్ విషయంలో తను లేని లోటును చార్మి భర్తీ చేసిందని చెప్పుకొచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ కు చార్మి మంచి ప్రచారం కల్పించిందని తెలిపాడు.

ఇక సినిమా రిజల్ట్ పై స్పందిస్తూ, సినిమా సూపర్ హిట్ అవుతుందని తను రిలీజ్ కు ముందే చెప్పానని అదే జరిగిందని చెప్పుకొచ్చాడు. అటు మణిశర్మ విషయంలో కూడా ఇలానే రియాక్ట్ అయ్యాడు రామ్.

ఈ సినిమాతో మణిశర్మ బౌన్స్ బ్యాక్ అవుతాడని, మణి 2.Oను ప్రేక్షకులు చూస్తారని రిలీజ్ కు ముందే చెప్పానని, సినిమా రిలీజైన తర్వాత అంతా మణిశర్మను మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చాడు.

అటు పూరితో ఇస్మార్ట్ శంకర్ లాంటి క్యారెక్టర్ ను డిజైన్ చేయించిన ఘనత కూడా తనదే అంటున్నాడు రామ్. ఇలా ఈరోజు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు.

First Published:  3 Aug 2019 9:35 AM GMT
Next Story