Telugu Global
National

యాంకర్‌ ముస్లిం అని కళ్లు మూసుకున్న వైనం

దేశంలో కొందరికి మత పిచ్చి అమాంతం అంటు వ్యాధిలా పెరిగిపోతోంది. ఇటీవల ముస్లిం యువకుడు ఫుడ్ డెలివరీ చేశారని…ఢిల్లీలో ఒక వ్యక్తి ఆ ఫుడ్‌నే వెనక్కు పంపాడు. ఈ అంశంపైనే జాతీయ టీవీ చానల్‌ న్యూస్ 24 చర్చా కార్యక్రమం నిర్వహించగా… చర్చలో పాల్గొన్న ”హమ్ హిందూ” సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ గౌతమ్ వింతగా ప్రవర్తించాడు. చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్ ముస్లిం కావడంతో అతడిని చూసేందుకు గౌతమ్ ఇష్టపడలేదు. చర్చా కార్యక్రమం జరుగుతున్నంత సేపు… తన […]

యాంకర్‌ ముస్లిం అని కళ్లు మూసుకున్న వైనం
X

దేశంలో కొందరికి మత పిచ్చి అమాంతం అంటు వ్యాధిలా పెరిగిపోతోంది. ఇటీవల ముస్లిం యువకుడు ఫుడ్ డెలివరీ చేశారని…ఢిల్లీలో ఒక వ్యక్తి ఆ ఫుడ్‌నే వెనక్కు పంపాడు.

ఈ అంశంపైనే జాతీయ టీవీ చానల్‌ న్యూస్ 24 చర్చా కార్యక్రమం నిర్వహించగా… చర్చలో పాల్గొన్న ”హమ్ హిందూ” సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ గౌతమ్ వింతగా ప్రవర్తించాడు.

చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్ ముస్లిం కావడంతో అతడిని చూసేందుకు గౌతమ్ ఇష్టపడలేదు. చర్చా కార్యక్రమం జరుగుతున్నంత సేపు… తన కళ్లకు రెండు చేతులు అడ్డుపెట్టుకుని మాట్లాడారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. గౌతమ్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  2 Aug 2019 9:55 PM GMT
Next Story