Telugu Global
NEWS

వైసీపీ వైపు గౌరు ఫ్యామిలీ చూపు ?

కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. గౌరు ఫ్యామిలీ మొదటి నుంచి వైఎస్ కుటుంబం వెంటే నడిచేది. వైఎస్ అండ వల్లే గౌరు చరిత ఓ సారి ఎమ్మెల్యే అయ్యారు. జగన్ అండతో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. గౌరు వెంకట రెడ్డి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పాణ్యం […]

వైసీపీ వైపు గౌరు ఫ్యామిలీ చూపు ?
X

కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. గౌరు ఫ్యామిలీ మొదటి నుంచి వైఎస్ కుటుంబం వెంటే నడిచేది. వైఎస్ అండ వల్లే గౌరు చరిత ఓ సారి ఎమ్మెల్యే అయ్యారు. జగన్ అండతో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. గౌరు వెంకట రెడ్డి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు పాణ్యం నియోజకవర్గానికి చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకే టికెట్ ఇస్తారని తలిచిన గౌరు ఫ్యామిలీ వైసీపీ వీడింది. టీడీపీలో చేరారు. నంద్యాల ఎంపీ టికెట్ గౌరు వెంకట రెడ్డి బావ శివానందారెడ్డికి టీడీపీ ఇచ్చింది. దీంతో గౌరు ఫ్యామిలీ కూడా ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఓడిపోయారు.

ఎన్నికల సమయంలో గౌరు ఫ్యామిలీ ఎక్కడా కూడా వైసీపీపై విమర్శలు చేయలేదు. జగన్ ను ఒక్క మాట కూడా అనలేదు. టికెట్ రాకపోవడంతో అనుచరుల ఒత్తిడి వల్లే పార్టీ మారాల్సి వచ్చిందని గౌరు ఫ్యామిలీ ఇప్పుడు చెబుతోంది. అంతేకానీ జగన్ పై తమకు ఎలాంటి కోపం లేదని అంటోంది.

జిల్లా వైసీపీలో కూడా గౌరు ఫ్యామిలీ తిరిగి పార్టీలోకి రావడంపై వ్యతిరేకత ఏమీ లేదని తెలుస్తోంది. అయితే సీఎం జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరం. ఎన్నికల ముందు తనను విడిచి వెళ్లిన వారిని తిరిగి ఆహ్వానిస్తారా? లేదా? అనేది చూడాలి.

First Published:  1 Aug 2019 11:29 PM GMT
Next Story