Telugu Global
NEWS

ప్రో-సర్క్యూట్ వైపు తిరిగి సానియా చూపు

2020 నుంచి సానియా రెండో ఇన్నింగ్స్ షురూ మాతృత్వంతో రెండేళ్లుగా టెన్నిస్ కు దూరం భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా… రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రొఫెషనల్ టెన్నిస్ రీ-ఎంట్రీకి తహతహలాడుతోంది. ఏడాది క్రితమే ఓ బిడ్డకు జన్మనివ్వడం ద్వారా తల్లిహోదా పొందిన సానియా..నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో కెరియర్ లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలన్న పట్టుదలతో ఉంది. టెన్నిస్ లో తాను సాధించాల్సింది, సరికొత్తగా నిరూపించుకోవాల్సింది ఏదీ లేదని తేల్చి చెప్పింది. రోజుకు 4 గంటలపాటు […]

ప్రో-సర్క్యూట్ వైపు తిరిగి సానియా చూపు
X
  • 2020 నుంచి సానియా రెండో ఇన్నింగ్స్ షురూ
  • మాతృత్వంతో రెండేళ్లుగా టెన్నిస్ కు దూరం

భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా… రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రొఫెషనల్ టెన్నిస్ రీ-ఎంట్రీకి తహతహలాడుతోంది.

ఏడాది క్రితమే ఓ బిడ్డకు జన్మనివ్వడం ద్వారా తల్లిహోదా పొందిన సానియా..నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో కెరియర్ లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలన్న పట్టుదలతో ఉంది. టెన్నిస్ లో తాను సాధించాల్సింది, సరికొత్తగా నిరూపించుకోవాల్సింది ఏదీ లేదని తేల్చి చెప్పింది.

రోజుకు 4 గంటలపాటు సాధన..

మాతృత్వం కోసం గత రెండేళ్లుగా టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా.. పదకొండు మాసాల క్రితమే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కుమారుడు ఇజాన్ ఆలనాపాలనా చూస్తూనే… పూర్తిస్థాయి ఫిట్ నెస్ కోసం రోజుకు రెండు విడతలుగా నాలుగు గంటలపాటు కఠోర సాధన చేస్తోంది.

ప్రసవం తర్వాత సానియా అనూహ్యంగా బరువు పెరిగిపోయింది. దీంతో బరువు తగ్గడం ద్వారా ప్రొఫెషనల్ టెన్నిస్ కు అవసరమైన ఫిట్ నెస్ కోసం జిమ్ లోనే గంటలపాటు గడుపుతోంది.

26 కిలోల బరువు తగ్గిన సానియా..

మూడుపదుల వయసులో తల్లిగా మారిన సానియా..రోజుకు నాలుగు గంటలపాటు జిమ్ లో వర్కవుట్ చేయడం ద్వారా 26 కిలోల మేర బరువు తగ్గింది.

2020 టోక్యో ఒలింపిక్స్ నాటికి ఫిట్ నెస్ సాధించి… భారతజట్టులో చోటు సంపాదించాలన్న పట్టుదలతో ఉంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తో కలసి దుబాయ్ లో కాపురముంటున్న సానియా…అక్కడ కసరత్తులు చేస్తోంది.

వచ్చే ఏడాది నాటికి పూర్తి ఫిట్ నెస్ తో ప్రొఫెషనల్ టెన్నిస్ లో తిరిగి అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉంది.

నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు…

తన కెరియర్ లో ఇప్పటికే మూడు మిక్సిడ్ టైటిల్స్ తో సహా మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన సానియా.. మహిళల డబుల్స్ లో నంబర్ వన్ ర్యాంక్ సైతం సాధించింది.

ఆసియా క్రీడలు,శాఫ్ గేమ్స్, జాతీయ క్రీడల టెన్నిస్ సింగిల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో పతకాలు సాధించింది.

అయితే… రీ-ఎంట్రీలో తాను సరికొత్తగా నిరూపించుకోవాల్సి ఏమీలేదని…తనకు లక్ష్యాలు అంటూ ఏవీలేవని..సంపూర్ణ ఫిట్ నెస్ తో తిరిగి అంతర్జాతీయ టెన్నిస్ ఆడటమే లక్ష్యమని ప్రకటించింది.

టెన్నిస్ ఆడటమన్నా…పోటీపడటమన్నా తనకు చెప్పలేని ఇష్టమని..తన కుమారుడు ఇజాన్ మాలిక్ మీర్జా ప్రేరణతో తిరిగి టెన్నిస్ ఆడాలని నిర్ణయించినట్లు సానియా చెబుతోంది.

భారత మహిళా టెన్నిస్ చరిత్రలోనే అరుదైన విజయాలతో పాటు…వందకోట్ల రూపాయలకు పైగా ఆర్జించిన సానియా… హైదరాబాద్ లో తనపేరుతో ఓ అకాడమీని సైతం నిర్వహిస్తోంది.

First Published:  1 Aug 2019 8:38 PM GMT
Next Story